HomeNewsNationalఎండలు... మరింత తీవ్రం

ఎండలు… మరింత తీవ్రం

ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు
భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రమవుతాయని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఐఎండి ప్రకటనను అనుసరించి, ఏప్రిల్‌, మే మాసాల్లో ఎండలు అధికంగా ఉంటాయి. ఈనెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎండల కష్టం తప్పకపోవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల మధ్య, పశ్చిమ భారతాల్లో నమోదుకానుండగా, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు. ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో మైదానాల్లోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వడగాల్పులు వీస్తాయి. ఈ పరిస్థితి సాధారణం కంటే నాలుగు నుంచి ఎనిమిది రోజులు ఉంటుంది. గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఇలావుంటే, అధిక ఉష్ణోగ్రతల వల్ల గోధుమ పంటకు ఎలాంటి ప్రమాదం లేదని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మొహాపాత్ర తెలిపారు. మధ్యప్రదేశ్‌ మినహా, గోధుమ ఎక్కువగా పండించే రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఎండల తీవ్రత కారణంగా పంటలు దెబ్బతినే పరిస్థితులు తలెత్తవని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 37 నుంచి 40 డిస్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నది. ఇది 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వివరించారు. కాగా, మన దేశం 202223 ఆర్థిక సంవత్సరంలో 1.105.5 మిలియన్‌ టన్నుల గోధుమను ఉత్పత్తి చేసింది. ఇందులో 30.40 శాతం వాటా ఉత్తరప్రదేశ్‌ది. మధ్యప్రదేశ్‌ 20.56 శాతం, పంజాబ్‌ 15.18 శాతం, హర్యానా 9.89 శాతం, రాజస్థాన్‌ 3.62 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments