సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
పార్టీ అభ్యర్థి జయసారథిరెడ్డికి బి ఫామ్ అందజేత
ప్రజాపక్షం/హైదరాబాద్‌రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నించే గొంతుక కావాలని,అందుకే ప్రజల పక్షాన పోరాడే వామపక్షాలు బలపర్చిన నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ సిపిఐ ఎంఎల్‌సి అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పట్ట భద్రులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పార్టీ బి-ఫామ్‌ను సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డికి శనివారం అందజేశారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమతో కలిసొచ్చే అందరి మద్దతు కోరుతామన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జయసారథిరెడ్డి గెలుపు నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రుల గెలుపుగా ఉంటుందన్నారు. జయసారథిరెడ్డికి ప్రజా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై అవగాహన ఉన్నదని, జర్నలిస్టుగా ముఖ్యపాత్రను పోషించారని వివరించారు. ఇప్పటికే వామపక్షాలు, అనుబంధ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థి జయసారధిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కల సాకారం కాలేదని, ఉద్యోగుల పిఆర్‌సి సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనను ఎంఎల్‌సిగా గెలిపిస్తే ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగాల పక్షాన పోరాడే ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పారు. ఉద్యోగులను ఎసిబి పేరుతో భయపెట్టిస్తున్నారని, ఉద్యోగ హక్కులు, సమస్యల పరిష్కారానికి వామపక్షాలు పోరాటం చేస్తాయని, పూర్తి అండగా ఉంటాయని భరోసనిచ్చారు.
ఎంఎల్‌సి ఎన్నికల్లో కలిసొచ్చేవారి మద్దతు కోరుతాం
RELATED ARTICLES