HomeNewsBreaking Newsఎంఎల్‌ఎల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌

ఎంఎల్‌ఎల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌

అక్రమ నిర్మాణాల కూల్చివేత
ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నలుగురు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెం దిన నందకుమార్‌ అక్రమ నిర్మాణాలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌ నగర్‌లో డెక్కన్‌ కిచెన్‌ను ప్రమోద్‌ అనే భాగస్వామితో కలిసి నందకుమార్‌ నిర్వహిస్తున్నాడు. ఫిల్మ్‌ నగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిం చి, వాణిజ్య పరమైన అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు హోటల్‌ డెక్కన్‌ కిచెన్‌, ఇతర షాపులను జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆదివారం కూల్చేశారు. సిని నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు, దగ్గుబాటి రానాకు చెందిన స్థలాన్ని నందకుమార్‌ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల నుంచి కానీ, జిహెచ్‌ఎంసి నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు సాగిస్తున్నారు. ఈ విషయంలో యజమానులు జిహెచ్‌ఎంసికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఇరువురి మధ్య వివాదం నెలకొనగా కోర్టుకు వెళ్లడంతో అది ఇప్పుడు విచారణలో ఉంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగిస్తుండటంతో గతంలోనే తాము నోటీసులు జారీ చేసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. నోటీసులపై నందకుమార్‌ కోర్టుకు వెళ్లడంతో స్టేటస్‌కో అర్డర్‌ వచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి, నిర్మాణాలు సాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలకు వాడుతున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు చెప్పారు. నోటీసులు ఇచ్చినా ఆపకుండా రాత్రి సమయాల్లో నిర్మాణాలు కొనసాగిస్తుండటంతో కూల్చివేతలు జరిపామని జిహెచ్‌ఎంసి జూబ్లీహిల్స్‌ సర్కిల్‌కు చెందిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చేవేశారు. అయితే భవనం కూల్చివేతను నందుకుమార్‌ భార్య చిత్ర అడ్డుకున్నారు. తమ లీజ్‌ ల్యాండ్‌లో అక్రమంగా అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భవనం కూల్చివేశారని ఆరోపించారు. అన్ని ఆధారాలను అధికారులకు అందిస్తామని చిత్ర తెలిపారు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments