HomeNewsBreaking Newsఎంఎల్‌ఎలకు ఎర కేసులో నిందితులకు బెయిల్‌ తిరస్కరణ

ఎంఎల్‌ఎలకు ఎర కేసులో నిందితులకు బెయిల్‌ తిరస్కరణ

ప్రజాపక్షం / హైదరాబాద్‌ ఎంఎల్‌ఎలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ నాంపల్లి అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) కోర్టు తిరస్కరించింది. నిం దితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. దర్యాప్తు సందర్భంలో బెయిల్‌ ఇస్తే ఆటంకం ఎదురవుతుందన్న న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉండగా నందకుమార్‌పై మరో రెండు కేసులు నమోదయ్యాయి. డెక్కన్‌ కిచెన్‌ యాజమాన్యంతో పాటు నందకుమార్‌ వద్ద స్థలం లీజుకు తీసు న్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 2021 జూన్‌లో తమ ప్రాంగణాన్ని నందకుమార్‌ వ్యాపారానికి వాడుకోమ్మన్నాడని, తన సోదరులతో కలిసి 3వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వైపు నాంపల్లి కోర్టులో పోలీసులు పీటీ వారంట్‌ దాఖలు చేశారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా నందకుమార్‌ అరెస్టుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరుతూ పీటీ వారంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. కోర్టు అనుమతి ఇస్తే నందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments