సిపిఐ డిమాండ్
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్‌ఐ)కు ఇచ్చిన రుణాలపై వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఎంఎఫ్‌ఐలనేవి గ్రామీణ పేదలకు, స్వయం ఉపాధి పొందే నిరుద్యోగులకు జీవనరేఖ లాంటిదని, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రుణాలిచ్చి వారిని ఆదుకుంటూ వుంటాయని గుర్తు చేవారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు, సంపన్న వర్గాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నదని, కానీ అదే సమయంలో సమాజంలో అవసరమైన పేదలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, కొవిడ్ 19 లాక్‌డౌన్‌లో సైతం ఆ వర్గాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిబంధనలను సడలించి, ఎంఎఫ్‌ఐలపై వడ్డీ భారాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం, ఆర్‌బిఐలకు విజ్ఞప్తి చేశారు.
ఎంఎఫ్‌ఐ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి
RELATED ARTICLES