HomeNewsBreaking Newsఊహకందని కొత్తకేసులు

ఊహకందని కొత్తకేసులు

భారత్‌లో మరోసారి రికార్డుబ్రేక్‌
కొత్తగా 77,266 మందికి కరోనా పాజిటివ్‌
మహమ్మారి కాటుకు మరో 1,057 మంది బలి
33,87,500లకు చేరిన బాధితులు
61,529కి ఎగబాకిన మరణాలు
4 కోట్లకు చేరువలో కరోనా నిర్ధారణ పరీక్షలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ అంతకంతకూ తీవ్రమవుతోంది. రోజు రోజుకీ కొత్త, కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 75,760 కేసులు బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య భారత్‌లోనే నమోదు కాగా, మళ్లీ అంతకంటే ఎక్కవ కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 77,266 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 33,87,500లకు చేరింది. అదే విధంగా రికవరీల సంఖ్య కూడా 25,83,948కి ఎగబాకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 1,057 మందిని మహమ్మారి బలి తీసుకుంది. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం దాదాపు ఇది నాల్గొవసారి. కొత్త మృతులతో కలిపి మొత్త మరణాల సంఖ్య 61,529కి చేరింది. అయినప్పటికీ మరణాల రేటు 1.82 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 76.28 ఉన్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 7,42,023 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 21.90 శాతం మాత్రమే. దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగానే నిర్వహిస్తున్నారు. గురువారంనాడు దేశవ్యాప్తంగా 9,01,338 శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 3,94,77,484 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసిఎంఆర్‌ పేర్కొంది. ఆగస్టు 21వ తేదీన ఒక్కరోజే రికార్డుస్థాయిలో 10లక్షల 23వేల పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్‌, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారత్‌ నాల్గొవ స్థానంలో కొనసాగుతుంది.
ఆ మూడు రాష్ట్రాల్లోనే పెరుగుతున్న మృతుల సంఖ్య
మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో మరో 355 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 23,444కు ఎగబాకింది. తమిళనాడులో 24 గంటల్లో 109 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 6,948కి చేరింది. కర్నాటకలో కొత్తగా 141 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,232కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం మృతుల సంఖ్య 4,369గా ఉండగా, కొత్తగా 22 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం నాడు 95 మంది బలి కాగా, మొత్తంగా 3,633 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 68 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 3,217గా ఉంది. గజరాత్‌లో మరో 17 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 2,962కి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా 53 మంది, మొత్తంగా 3,017, మధ్యప్రదేశ్‌లో తాజాగా 24 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 1,306కి చేరింది. పంజాబ్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,256కి చేరగా, తాజాగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాజస్థాన్‌లోనూ మృతుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటి వరకు 1,005 మరణాలు సంభవించగా, 24 గంటల్లో తాజాగ 13 మంది మృతి చెందారు.
4 కోట్లకు చేరువలో కరోనా నిర్ధారణ పరీక్షలు
దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా చేస్తున్నారు. ప్రస్తుతానికి పరీక్షల 4 కోట్లకు చేరువైంది. ఇప్పటి వరకు మొత్తంగా 3,94,77,848 కరోనా పరీక్షలను నిర్వహించారు. గత రెండు వారాల్లోనే కోటికిపైగా శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మిలియన్‌ జనాభాలో పరీక్షల సంఖ్య 28,607కు చేరింది. కాగా, భారత్‌లో వరుసగా రెండవరోజూ 9 లక్షలకు పైగా శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించారు. రోజుకు 10 లక్షల పరీక్షలను నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉందని ఇప్పటికే నిరూపించుకుంది. దేశంలో ప్రస్తుతం 1,564 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ఉండగా, అందులో 998 ల్యాబ్‌లు ప్రభుత్వానికి చెందినవి కాగా, మరో 566 ల్యాబ్‌లు ప్రైవేటువి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments