ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనాలు పురావస్తు భవనాల జాబితాలో ఉందో లేదో చెప్పాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. అదే మాదిరిగా ఆస్పత్రి మరమ్మత్తులకు రూ.6 కోట్లు విడుదల చేసిన నిధులతో జరిగిన పనుల పురోగతిని కూడా చెప్పాలంది. ఈ మేరకు గురువారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనాలు శిథిలావస్థలో కూలిపోయేలా ఉన్నాయని హెల్త్‌కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్‌కుమార్, ఉస్మానియా ఆస్పత్రిని మళ్లీ నిర్మించేందుకు రూ.200 కోట్లను వెచ్చిస్తామన్న ప్రభుత్వం రూ.6 కోట్ల నే విడుదల చేసిందని సీనియర్ సిటిజన్స్ ఎన్‌జివోస్ ఆఫ్ ది సొసైటీ వేసిన రెండు పిల్స్‌పై విచారణ వచ్చే నెల 4కి వాయిదా వేసింది. కొందరు కూల్చి మళ్లి కట్టాలని కోరితే మరికొందరు పురాతన భవనాన్ని కాపాడాలని రిట్లు వేశారని, వీటన్నింటినీ కలిపి విచారణ చేస్తామని చెప్పింది. ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ ప్రమాదకరంగా ఉందని, వైద్యులు నుంచి రోగుల వరకూ అందరికీ ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ లాయర్ సందీప్‌రెడ్డి వాదించారు. దీనిని నిజాం కాలంలో కట్టారని, 150 ఏండ్లు అయ్యిందని, నేటి అవసరాలకు వీలుగా మళ్లీ కట్టేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రిలో కొంత భాగం పురావస్తు సంపదని, దీనిని మినహాయించి మిగిలిన భవనాలకు రిపేర్లు చేస్తున్నట్లు గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ సంజీవ్‌కుమార్ చెప్పారు. 2019లో నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చిందని, రిపేర్లు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.6 కోట్లతో జరిగిన పనులపై వివరాలు ఇవ్వడానికి సమయం కావాలన్నారు. దీంతో విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది.
‘ఉస్మానియా’ పురావస్తు భవనమా? కాదా?
RELATED ARTICLES