వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల రాస్తారోకో
రహదారుల దిగ్బంధనం : కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
మూడు గంటల పాటు స్తంభించిన తెలంగాణ
నాయకుల అరెస్టులు.. తరలింపులు.. వాగ్వాదాలు
ప్రజాపక్షం న్యూస్ నెట్వర్క్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శనివారం వామపక్షాలు, అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి) సంయుక్త అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు రహదారులపై బైఠాయించి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం తో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రవాణా వ్యవస్థ స్థంభించింది. రోడ్లపై కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. వామపక్షాల, రైతు సంఘా ల నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ వద్ద జరిగిన రాస్తా రోకో కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, వామపక్ష పార్టీల నాయకులు డి.జి.నరసింహారావు, చెరుపల్లి సీతారాములు (సిపిఐ(ఎం), కె.రమాదేవి (సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), డి.రాజేష్ (సిపిఐ(ఎంఎల్) లిబరేషన్), కె.గోవర్ధన్ (సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఎఐకెఎస్సిసి కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్, కలకొండ కాంతయ్య (బికెఎంయు) లతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడడం మానుకోవాలని, రైతుల డిమాండ్లను అంగీకరించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో వామపక్షాల ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని సిపిఐ కార్యాలయం నుండి వామపక్షాల కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి రాపర్తి నగర్ చేరుకుని అక్కడ రైల్వే ప్లుఓవర్ పై రాస్తారోకో నిర్వహించారు. ఉద్యమకారులు రోడ్లపై పడుకకుని వ్యవసాయ చట్టాలకు నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన వామపక్ష కార్యకర్తలు మోడీ తెచ్చిన సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా నినాదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు పాల్గొన్నారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన భారతదేశ రైతాంగం అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సవరణ కాకుండా చట్టాలను రద్దు చేయాల్సిందేనని వామపక్ష నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులు వి. హన్మంతరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ సెంటర్ జజాతీయ రహదారిపై వామపక్షాలు, ఎఐకెఎస్సిసి నేతలు రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ బిజెపి ప్రబుత్వానికి వ్యతిరూకంగా నిరసన తెలిపారు.
మరోవపై రాజీవ్ రహదారిపై మేడ్చల్ జిల్లా అల్వాల్ ఈ సేవ కేంద్రం వద్ద జరిగిన రాస్తా రోకోలోలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ రహదారిపై ఉప్పల్ డిపో వద్ద జరిగిన రాస్తా రోకోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండ కూడలిలో జరిగిన రాస్తారోకోలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎన్.జ్యోతి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చర్లపల్లిలో విజయవాడ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు.
పార్టీల నాయకులు డి.జి.నరసింహారావు, చెరుపల్లి సీతారాములు (సిపిఐ(ఎం), కె.రమాదేవి (సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), డి.రాజేష్ (సిపిఐ(ఎంఎల్) లిబరేషన్), కె.గోవర్ధన్ (సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఎఐకెఎస్సిసి కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్, కలకొండ కాంతయ్య (బికెఎంయు) లతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం స్పందించి రైతుల పట్ల అమానవీయ చర్యలకు పాల్పడడం మానుకోవాలని, రైతుల డిమాండ్లను అంగీకరించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో వామపక్షాల ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని సిపిఐ కార్యాలయం నుండి వామపక్షాల కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరి రాపర్తి నగర్ చేరుకుని అక్కడ రైల్వే ప్లుఓవర్ పై రాస్తారోకో నిర్వహించారు. ఉద్యమకారులు రోడ్లపై పడుకకుని వ్యవసాయ చట్టాలకు నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన వామపక్ష కార్యకర్తలు మోడీ తెచ్చిన సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా నినాదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు పాల్గొన్నారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన భారతదేశ రైతాంగం అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సవరణ కాకుండా చట్టాలను రద్దు చేయాల్సిందేనని వామపక్ష నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకులు వి. హన్మంతరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుగడప గ్రామ సెంటర్ జజాతీయ రహదారిపై వామపక్షాలు, ఎఐకెఎస్సిసి నేతలు రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ బిజెపి ప్రబుత్వానికి వ్యతిరూకంగా నిరసన తెలిపారు. మరోవపై రాజీవ్ రహదారిపై మేడ్చల్ జిల్లా అల్వాల్ ఈ సేవ కేంద్రం వద్ద జరిగిన రాస్తా రోకోలోలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ రహదారిపై ఉప్పల్ డిపో వద్ద జరిగిన రాస్తా రోకోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండ కూడలిలో జరిగిన రాస్తారోకోలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎన్.జ్యోతి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా చర్లపల్లిలో విజయవాడ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు.