వ్యాపారుల నిల్వలపై పరిమితి విధించిన కేంద్రం
న్యూఢిల్లీ : వంటింటిలో ప్రధాన దినుసు అయిన ఉల్లిగడ్డ ధరలు దేశ వ్యాప్తంగా ఎకబాకుతున్న వేళ ధరలు కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఎగుమతిని నిషేధించింది. అదే విధంగా సరుకు లభ్యతను దేశీయంగా మెరుగుపరిచేందుకు వ్యాపారులు చేస్తున్న నిల్వలపై పరిమితిని విధించింది. చిల్లరవ్యాపారులకు కేవలం వంద క్వింటాళ్ల వరకు, హోల్‌సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్ల వరకు ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. అక్రమ నిల్వలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కనిష్ట ఎగుమతి ధరకు (ఎంఇపి)కు తక్కువకు బంగ్లాదేశ్, శ్రీలంకకు చేసే ఎగుమతులు తక్షణమే ఆపేయాలని, ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉల్లిగడ్డ చిల్లర ధరలు ఆగస్టు నుంచి అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ధరలను నిరోధించేందుకు, సరఫరాను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వంటింటి రారాజు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉల్లి చిల్లర ధరలు కిలోకి రూ. 60 పలుకుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక వంటి ఉల్లిని పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తడంతో సరఫరాలో ఆటంకం కలగడమే ఉల్లిధరల పెరుగుదలకు కారణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. కాగా, మార్కెట్‌లో ఉల్లి ధరలు గరిష్ఠస్థాయిలో పెరిగి స్థిరపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ధరలును అడ్డుకునేందుకు ఆదివారం అనేక చర్యలను తీసుకుంది. వ్యాపారులు చేస్తున్న నిల్వలపై పరిమితి విధించింది. ఎగుమతులను నిషేధించింది. అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. 23.90కే ఇస్తోంది.
ఉల్లి ఎగుమతులపై నిషేధం
RELATED ARTICLES