ఆర్బిఐ గవర్నర్ పదవికి గుడ్‌బై
న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్(55) సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా దే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో తలపడిన ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చ ర్య పరుస్తోంది. ‘వ్యక్తిగత కారణాలతోనే ఆర్బిఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నాను’ అని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బిఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్ పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బిఐ డైరెక్టర్ల కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆయన తన రాజీనామాలో ఎక్కడా ప్రభుత్వం లేక ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్లు పేర్కొనలేదు. 2016 నుంచి ఆర్బిఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్ పటేల్ తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసి గవర్నర్‌గా ఎదిగిన ఎనిమిదో వ్యక్తి ఉర్జిత్ పటేల్. ఇదివరలో వైవి రెడ్డి డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసి గవర్నర్ అయ్యారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయ న పదవీకాలం ఉంది. ఉర్జిత్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోడీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. అయి తే, గతకొంతకాలంగా విధాన నిర్ణయాల విషయంలో కేంద్రంతో ఉర్జిత్ విబేధిస్తున్న సంగతి తెలిసిందే. తాను చెప్పినట్టు వినకుండా ఉర్జిత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం కేంద్రాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోం ది. ఆర్థికపరంగా దేశం ఒకింత క్లిష్టసమయంలో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశముంది. ఉర్జిత్ రాజీనామాను అస్త్రంగా చేసుకొని పార్లమెంటు శీతాకాల సమావేశా ల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశముందని తెలుస్తోంది.
మేం మిస్సవుతున్నాం: ప్రధాని మోడీ
ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో స్పందించారు. ‘వృత్తిపరంగా ఉర్జిత్ పటేల్ తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయన ఆరేళ్లు దేశానికి సేవలందించారు. గొప్ప వారసత్వాన్ని ఆ యన అందించారు. ఆయనను మేం మిస్సవుతున్నాం’ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ అందించిన సేవలను ప్రభుత్వం ఎంతో గౌరవంతో కొనియాడుతోంది, ఆయన మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని తాను కోరుకుంటున్నాం’ అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కాగా దేశంలోని ఎంతో విలువైన వ్యవస్థలన్నింటినీ మోదీ ప్రభుత్వం వరుసగా ధ్వంసం చేస్తోందని, అందుకు తాజా నిదర్శనమే ఉర్జిత్ రాజీనామా అని కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు.
భారతీయులంతా ఆందోళన చెందాలి: రాజన్
భారత రిజర్వు బ్యాంకు పూర్వపు గవర్నర్ రఘురామ్ రాజన్ పదవికి రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ విషయంలో భారతీయులంతా ఆందోళ న చెందాలన్నారు. ‘ఓ ప్రభుత్వ ఉద్యోగిగా డాక్టర్ పటేల్ ఈ చివరి ప్రకటన చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ ప్రకటనను మనం గౌరవించాలి’ అని రాజన్ ‘ఇటి నౌ ’ అనే న్యూస్ ఛానెల్‌తో అన్నారు. ఈ తుది నిర్ణయం ఆయన తీసుకోడానికి దారితీసిన వివరాలలోకి మనం వెళ్లాల్సి ఉందన్నారు. ఆర్బిఐ అధికారాలు, పాలన విషయాల్లో చాలా మార్పు చోటుచేసుకుందని. తన పదవీ కాలంలో కూడా రాజన్ ప్రభుత్వంతో వి భేదించారు. పైగా తన పదవీ కాలం పొడగింపుకు ప్రయత్నించలేదు. ఆ ర్బిఐ చట్టంలోని 7వ నంబర్ సెక్షన్ గురించి ప్రస్తావన వచ్చినప్పటి నుంచే ఉర్జిత్ రాజీనామా తప్పదన్న ఊహాగానాలు చోటుచేసుకున్నాయి.