ప్రజాపక్షం/ వరంగల్‌బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసిం ది. గురువారం మధ్యాహ్నం నుండి రాత్రి వర కు కురిసిన అకాల వర్షానికి కల్లాలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్‌లలో విక్రయాల కోసం తీసుకువచ్చిన మిర్చి, ప్రత్తి బస్తాలు వర్షంతో తడిసి పోయాయి. అనేక చోట్ల రైతులు కల్లాల్లో మిర్చి భారీ వర్షం దాటికి తడిసి మిర్చి రైతులకు తీరని నష్టం కల్గించింది. సాయంత్రం నుండి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో కల్లాల్లో మిర్చితో పాటు పంట చేలల్లో మిగిలిన మిర్చి పంట కూడా దెబ్బతిని మిర్చి రైతులకు నష్టం కలిగించింది. కాగా భారీ వర్షంతో వరంగల్ నగరంలో రహదారులు నీటమునిగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా అటవీ ప్రాంతం కావడం గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మిర్చి పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణం పొడిగానే ఉండి గురువారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు జిల్లాల్లో వేర్వేరు సమయాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రైతులు కకలావికలమయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మిర్చి, పసుపు పంటలు చేతికొచ్చాయి. ఎక్కువ శాతం మిర్చి పంటలు పంట తీస్తున్న సమయంలోనే ఈ వర్షం కురవడం రైతులను తీవ్ర నష్టానికి గురి చేసి నట్లయింది. పంట నుండి తీసిన మిర్చిని చేలల్లోనే ఆరబెట్టారు. ఆకాలంగా కురిసిన వర్షంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి ముద్దయింది. మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే సూచన ఉన్నందున రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మిర్చి పంటను అధికంగా సాగు చేశారు. చేతికొచ్చిన పంట నీటి పాలవుతుండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం
RELATED ARTICLES