తక్కువ వాటా జమ చేస్తున్న ప్రభుత్వం
పెన్షన్ పథకం విఫలమవుతుందని కాగ్ హెచ్చరిక
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఒకవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తోం ది. సిపిఎస్ కింద ఉద్యోగుల వాటాకు సమానంగా జమ చేయాల్సిన ప్రభుత్వం.. తన వా టా మొత్తం కంటే తక్కువ జమ చేస్తున్నది. దీంతో ఉద్యోగుల పెన్షన్‌కే ఎసరొచ్చే ప్రమా దం కనిపిస్తోంది. ఈ విషయం కాగ్ నివేదికలో బయటపడింది. జాతీయ పెన్షన్ పథ కం కింద ప్రభుత్వోద్యోగులు తమ వంతుగా చెల్లించిన మొత్తానికి కంటే ప్రభుత్వం రూ. 49.87 కోట్లు తక్కువగా జమ చేసినట్లు కాగ్ గుర్తించింది. అంతకు ముందు కూడా ఇదే మాదిరిగా 2014- రూ.20.01 కోట్లు, 2016- రూ.71.91 కోట్లు తక్కువ జమ చేసింది. ప్రభుత్వం తరచుగా తన వాటాను తక్కువగా జమచేయడం, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ట్రస్టీ బ్యాంక్)కు తక్కువగా బదిలీ చేయడం, బదిలీ చేయని మొత్తాలకు వడ్డీ జమ కట్టకపోవడం వంటి వాటిని సరిదిద్దకపోతే చివరకు జాతీయ పింఛన్ వ్యవ స్థ మూలనిధి దివాళాకు, పథకం వైఫల్యానికి, చందాదారుల ప్రయోజనాల విఘాతానికి దారి తీస్తుందని కాగ్ హెచ్చరించింది.అదే సమయంలోఈ నిధి కింద రూ.730.64 కోట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిని ఇంకా ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయలేదని కాగ్ పేర్కొన్నది.