కరోనా అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం
వర్చువల్ రౌండ్ టేబుల్, రచ్చబండ కార్యక్రమాలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్ కరోనా వైరస్‌ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టి బాధితులను ఆదుకునేందుకు ఉద్యమాలను చేపట్టాలని సిపిఐ నిర్ణయించింది. అందులో భాగంగా కలి సివచ్చే వామపక్షాలు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలతో వర్చువల్ రౌండ్‌టేబుల్ సమావేశం, వర్చువల్ రచ్చబండ ద్వారా లక్షలాది మంది ప్రజలను చైతన్యపరిచేందుకు కార్యాచరణ రూపొందించి, అమలు గురించి పూనుకోవాలని తీర్మానించింది. జూమ్ యాప్ ద్వారా శుక్రవారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తాజా రాజకీయ పరిణామాలు, కరోనాకు సంబంధించిన అంశాన్ని, ఈనెల 15న హైదరాబాద్‌లో జరిగిన సిపిఐ, టిడిపి, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుల ప్రత్యేక సమావేశం వివరాలను వివరించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, అలాగే సహాయచర్యలు నామమాత్రంగా చేపట్టి చేతులు దులుపుకున్నాయని సమావేశం అభిప్రాయపడింది. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రైవేట్‌రంగాన్ని ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా 50 బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారని చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. విద్యుత్‌ను ప్రైవేట్‌పరం చేసే కుట్రలో భాగంగా 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని, వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణను ప్రవేశపెట్టేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల టోకు వ్యాపారానికి బహుళజాతి కంపెనీలకు వెసులుబాటు కల్పించే మూడు ఆర్డినెన్స్‌లు తెచ్చి, అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి సిపిఐ ఆధ్వర్యంలో రానున్న పదిరోజుల్లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర సచివాలయాన్ని కూలగొట్టడంపై ఉన్న పట్టుదల, గత ఆరు సంవత్సరాలకుపైగా అధికారంలో కొనసాగతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చారిత్రాత్మక ఉస్మానియా హాస్పిటల్ భవనాలపై, రోగుల భద్రతపై లేదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఇందుకు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు ఉంటున్న వార్డులోకి వర్షపు నీరు వచ్చి రోగులు ఇబ్బందులకు గురికావడం నిర్శనమన్నా
ఉద్యమ కార్యాచరణ
RELATED ARTICLES