HomeNewsBreaking Newsఉద్యమంలో కొట్లాడినోళ్లం నిజాలు మాట్లాడమే వచ్చు

ఉద్యమంలో కొట్లాడినోళ్లం నిజాలు మాట్లాడమే వచ్చు

ప్రజాపక్షం/కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాల్లో మంత్రి ఈటల రాజేందర్‌ రాజేసిన ప్రకంపనలు కొనసాగతూనే ఉన్నాయి. ఈటల మాటలకు పర్యవసానలు ఎలాఉంటాయోనన్న చర్చ పార్టీ వర్గాలలో అంతర్గతంగా కొనసాగుతుండగానే మానకొండూర్‌ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌ మరోమారు నిప్పురాజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంపై మర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. స్థానిక కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న రాజకీయ దుమారాన్ని మరోమారు బహిర్గతం చేశాయి. ఈ సభలో రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్‌కు తనకు నిజాలు మాట్లాడటమే తెల్సునన్నారు. తాము ఉద్యమంలో కొట్లాడినోళ్ళమని చెప్పుకొచ్చారు. తమకు అబద్ధాలు మాట్లాడడం రాద ని… తాము కడుపులో ఏమీ దాచుకోమని కుండబద్దలుకొట్టారు. ఈ దశలో మంత్రి ఈటల జోక్యం చేసుకొని జాగ్రత్తగా మాట్లాడాలంటూ రసమయికి సూచించారు. అనంతరం మంత్రి రాజేందర్‌ మాట్లాడుతూ రసమయికి స్వేచ్ఛ ఎక్కువని.. ఆయన మాటాలతో ఏకీభవిస్తున్నానన్నారు. ప్రగతిభవన్‌ వేదికగా రెవెన్యూ సంస్కరణలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలోని అంశాలను మంత్రి ఈటల రాజేందర్‌ రెవెన్యూ అధికారులకు చేరవేశారని అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న రెండు పత్రికలు పతాక శీర్షికల్లో వండి వడ్డించాయి. ఆ కథనాల అనంతరం మంత్రి పదవి నుండి ఈటలకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఊపందుకొంది. ఆ పత్రికల కథనాలు, తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై హుజురాబాద్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ పార్టీ అధికార వేదికలో మంత్రి ఈటల భావోద్వేగంతో స్పందించారు. తాము ఉద్యమంలో కోట్లాడినోళ్లమని, మంత్రి పదవి తనకు రాజకీయ భిక్ష కాదని, తామే గులాబీ జెండాకు ఓనర్లమని సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఈ వ్యాఖ్యలు టిఆర్‌ఎస్‌ వర్గాలలో పెనుదుమారాన్ని సృష్టించాయి. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈటల వ్యాఖ్యలపై స్పందిస్తూ గులాబీ జెండాకు ఓనర్‌ కెసిఆర్‌ ఒక్కరు మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా ఈటల మంత్రి పదవికి వచ్చిన ముప్పుఏమిలేదని ముక్తాయింపుఇచ్చారు. ఈటల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి అంత్యసన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మికాంతరావు స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని సర్దుకు వచ్చే ప్రయత్నం చేశారు. గులాబీ జెండాకు అందురు ఓనర్లేనని, అందరు ఉద్యమంలో పాల్గొన్నవారేనని స్పష్టం చేశారు. అయితే ఈటల వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న దుమారానికి స్వస్తిపలికేందుకో, లేక తమవైఖరి స్పష్టం చేసేందుకో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు ఎవరి పేరును ప్రస్తావించకుండానే చేసిన వ్యాఖ్యలు తెరాస రాజకీయ దుమారాన్ని మరింత రాజేశాయి. పార్టీలో ఎవరు గొప్పవాళ్ళుకాదని…పార్టీతోనే పదవులు వచ్చాయన్న విషయాన్ని గమనిస్తే మంచిదని ఆయన పరోక్షంగా ఈటలకు చురకలు వేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈటెలను కలుసుకోవడానికి ఇష్టపడడంలేదని, ఆయన కదలికలపై నిఘా ఉంచారనే వార్తలు కూడా ఇటీవల సామాజిక మాధ్యమాలలో వెల్లువల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేసిన

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments