HomeNewsBreaking Newsఉత్కంఠ పోరులో రాజస్థాన్‌కు షాకిచ్చిన హైదరాబాద్‌

ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌కు షాకిచ్చిన హైదరాబాద్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను సన్‌రైజర్స్‌ ఓడించింది. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్‌ శర్మ ఈ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేశాడు. రాజస్థాన్‌ను తనే ఓడించాడని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు చేసింది. జోస్‌ బట్లర్‌ (95), సంజూ శాంసన్‌ (66 నాటౌట్‌), యశస్వి జైస్వాల్‌ (35) ముగ్గురూ మంచి స్కోర్లు చేశారు. ముఖ్యంగా శాంసన్‌ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌ ఛేజింగ్‌ను సన్‌రైజర్స్‌ కూడా బాగానే మొదలు పెట్టింది.కుర్ర ఓపెనర్లు అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (33), అభిషేక్‌ శర్మ (55) ఇద్దరూ అద్భుతమైన ఓపెనింగ్‌ అందించారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్‌ త్రిపాఠీ (47) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. అభిషేక్‌ అవుటైన తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిక్‌ క్లాసెన్‌ (12 బంతుల్లో 26) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.అయితే కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ (6) పెద్దగా ప్రభావం చూపలేదు. చివర్లో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 25) ధనాధన్‌ షాట్లతో చెలరేగాడు. అతను క్రీజులో ఉండి ఉంటే సన్‌రైజర్స్‌ సులభంగా గెలిచేది. కానీ కుల్దిప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడబోయిన ఫిలిప్స్‌ పెవిలియన్‌ చేరాడు. సమయంలో అబ్దుల్‌ సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌) మరోసారి తను క్వాలిటీ ఫినిషర్‌ అనే విషయాన్ని గుర్తుచేశాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో సమద్‌ కొట్టిన షాట్‌ను లాంగాఫ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టేశాడు. దీంతో రాజస్థాన్‌ సంబరాలు మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలో సందీప్‌ నోబాల్‌ వేసినట్లు అంపైర్‌ ప్రకటించాడు. సన్‌రైజర్స్‌ ఒక్క బంతిలో నాలుగు పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పుడు సందీప్‌ వేసిన బంతిని సమద్‌ చక్కని షాట్‌తో భారీ సిక్సర్‌ బాదాడు. దీంతో సన్‌రైజర్స్‌ డగౌట్‌ సంబరాల్లో మునిగిపోయింది. రాజస్థాన్‌ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దిప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్‌.. సందీప్‌ కనుక ఆ నోబాల్‌ వేయకపోతే కచ్చితంగా రాజస్థాన్‌ గెలిచేదని అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments