నెల్సన్: ఇంగ్లాండ్ x న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఆతిథ్య కివీస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఛేదనలో ఇంగ్లీష్ జట్టు పది పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడంతో 14 పరుగులతో ఓటమిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్(55), గప్తిల్ (33) బాధ్యతాయుతంగా ఆడి కివీస్‌కు భారీ స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ 31 బంతుల్లో 42 పరుగులు చేయాల్సి ఉండగా శాంట్నర్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ మోర్గాన్(18) ఔటయ్యాడు. దీంతో పది పరుగుల వ్యవధిలో సామ్‌బిల్లింగ్స్(1), జేమ్స్ విన్స్(49), లూయిస్ గ్రెగొరి(0) సామ్ కరన్(2) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. చివర్లో టామ్ కరన్(14), సాకిబ్ మహ్మద్(3) పోరాడిన ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2–1తో ముందంజలో నిలిచింది.
ఉత్కంఠ పోరులో కివీస్ గెలుపు
RELATED ARTICLES