ప్రతి మ్యాచ్ హోరాహోరీగానే..
క్రికెట్ అభిమానుల్లో యమ జోష్
క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీల్ ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నాయి. గతంతో పోల్చితే చాలా పరిణతి సాధించాయి అన్ని జట్లు. కిందటి సీజన్‌లలో మ్యాచ్ ఫలితాలు చాలా వరకు ఏకపక్షంగా ఉండేవి. అయితే ఈ సీజన్‌లో మాత్రం చాలా మ్యాచ్‌లు చివరి బంతి వరకు ను వ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి. ఆఖరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు మ్యాచ్‌లు తప్ప దాదాపు అన్ని పోటీలు కూడా ఆఖరి వరకు హోరాహోరీగా సాగుతున్నాయని చెప్పాలి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్ నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి మ్యాచ్ చివరి బంతి వర కు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో భారీ లక్ష్యాన్ని సైతం ఆయా జట్లు అలవోకగా ఛేదిస్తున్నాయి. మరోవైపు స్వల్ప ల క్ష్యాలను అందుకునేందుకు కూడా ఆఖరి బంతి వరకు పోరాడక తప్పని పరిస్థితి చాలా మ్యా చుల్లో నెలకొంది. దీన్ని బట్టి ఈసారి ఐపిఎల్ మ్యాచ్‌లు అభిమానులను ఎంతగానో కట్టి పడేస్తున్నాయి. చాలా మ్యాచులు చివరి వరకు నువ్వానేనా అన్నట్టుగానే సాగుతున్నాయి. వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్, బెంగళూరు జట్లు కూడా విజయం కోసం ఆఖరి వరకు పడ్డు వదలకుండా పోరాడుతూనే ఉన్నాయి. ఏ జట్టు ఓడినా తేడా చాలా స్వల్పంగానే ఉంటోం ది. ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప దాదాపు అన్ని పోటీలు రసవత్తరంగా సాగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆయా జట్ల క్రికెటర్లు విజయం కోసం సర్వం ఒడ్డుతున్నారు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. చివరి వరకు పోరాడడంలో ఈ జట్ల ఆటగాళ్లు ఆరితేరారు. ఈ సీజన్‌లో కిరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్య, డేవిడ్ వార్నర్, బైర్‌స్టో తదితరులు తమ జట్లకు సంచలన విజయాలు సాధించి పెట్టారు. అయితే రషీద్ ఖాన్, మహ్మద్ నబి, భువనేశ్వర్, సందీప్ శర్మ, బెహ్రాన్‌డార్ఫ్, అల్జారి జోసెఫ్, రబడా, కిమోపాల్, ఇషాంత్, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఇమ్రాన్ తాహిర్, చాహల్ తదితరులు బంతితో అసాధారణ పోరాట పటిమను కనబరిచి తమతమ జట్లకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెడుతున్నారు.
పూర్తయిన 33 మ్యాచ్‌లు..
ఇక, ఐపిఎల్‌లో భాగంగా ఇప్పటికే 33 మ్యాచ్‌లు జరిగాయి. దాదాపు చాలా మ్యాచ్‌లు నువ్వానేనా అన్నట్టుగానే సాగాయనడంలో సందేహం లేదు. ఏ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కష్టంగా మారింది. ప్రతి మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగడం సర్వసాధారణంగా మారింది. ఫలానా జట్టు గెలుస్తుందని చెప్పడం విశ్లేషకులకు సైతం క్లిష్టంగా తయారైంది. గెలిచే స్థితిలో ఉన్న జట్టు అనూహ్యంగా ఓడి పోవడం, అప్పటి వరకు గెలుపుపై ఏ ఆశలు లేని జట్టు సంచలన విజయం సాధించడం ఈ ఐపిఎల్ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా తయారైంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగియడంతో రానున్న మ్యాచులు మరింత ఆసక్తికరంగా సాగుతాయనడంలో సందేహం లేదు. ఇదే జరిగితే అభిమానులకు మరింత ఆసక్తికర మ్యాచ్‌లు చూసే అవకాశం దొరుకుతుందనే చెప్పాలి.
ఉత్కంఠభరితంగా ఐపిఎల్
RELATED ARTICLES