ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై తాను చర్చకు సిద్ధమని, మంత్రి కెటిఆర్ ఏ రైతువేదికకు వస్తారో చెబితే, తానూ అక్కడికి వస్తానని, సహా ఇద్దరమూ చర్చిద్దామని టిపిసిసి అధ్యక్షు లు రెడ్డి అన్నారు. సిరిసిల్ల, ఇలా ఏ రైతు వేదికలో, ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. ఉచిత కరెంటును బిఆర్‌ఎస్ ప్రభుత్వం తన అవినీతికి వాడుకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తక్కు వ ధరకే విద్యుత్‌ను అందిస్తామని చెప్పినా, కెసిఆర్ థర్మల్ విద్యుత్‌ను తెరపైకి తెచ్చారన్నారు. 24 గంటల విద్యుత్ సింగిల్ ఫెజ్ అని సిఎండి ప్రభాకర్ రావు జనవరి 30న చెప్పారని, 24 గంటలు త్రీ ఫెజ్ ఇవ్వడం లేదని ఆయన ఒప్పు కున్నారని, వ్యవసాయానికి అవసరమైనంత మాత్రమే ఇస్తున్నామని సిఎండి వెల్లడించినట్టు రేవంత్ తెలిపారు. దేశంలో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గుజరాత్ ఇండియా బుల్స్ వద్ద కెసిఆర్, కెటిఆర్ వెయ్యి కోట్ల రూపాయాల లంచం తీసుకుని సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చుకున్నారని ఆరోపించారు. దీనిని రూ.7,290 కోట్లకు బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించారన్నారు. కెసిఆర్ అవినీతి వల్లనే కెటిపిఎస్ రూ.945కోట్లు, భద్రాద్రి రూ.4,538 కోట్లు, యాదాద్రి కోట్ల నష్టం జరిగిందని, మొత్తంగా రూ.14 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్నారు. మూడు ప్రాజెక్టులు కలిపి రూ.45,730 కోట్లకు టెండరును ఆహ్వానించారని, ఇందులో 30శాతం కెసిఆర్ కమీషన్ కొట్టేశారని ఆరోపించారు. ప్రజలు అవినీతి గురించి ప్రశ్నిస్తారనే కెసిఆర్ బిహెచ్‌ఇఎల్‌ను ముందు పెట్టారన్నారు. బిహెచ్‌ఇఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీకి క్లబ్బు, తప్ప వ్యవసాయం తెలియదంటావా, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వారసునిపైన కెటిఆర్ అంత మాట అంటారా అని మండిపడ్డారు. పగలుకు, తేడా తెలియని కెటిఆర్ రాహుల్‌ను విమర్శిస్తావా?, అసలు కెటిఆర్‌కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా?, బుడ్లు, బెడ్లు తప్ప కెటిఆర్‌కు వ్యవసాయం తెలియదన్నారు. రాహుల్‌పై కెటిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కెటిఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
24గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతువేదికలకు తాళం వేయండి
రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతువేదికలకు తాళం పెట్టి, నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, గంటల కరెంటు ఇచ్చే వరకు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను చెట్లకు కట్టేసి నిలదీయాలన్నారు. బిజెపి, చీకటి మిత్రులని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధబమని రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ నాయకత్వంపై హరీష్‌కు విశ్వాసముంటే కెసిఆర్ గజ్వేల్‌లోనే పోటీ చేయాలని, సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని, కెసిఆర్ పాలనకు ఇదే రెఫరెండమని తెలిపారు. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కెసిఆర్‌కు గజ్వేల్‌లో పోటీ చేయడానికి భయమేందుకని ప్రశ్నించారు.
ఉచితచర్చకు సిద్ధం
RELATED ARTICLES