ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : అన్ని జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నందున ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులలో ఉచితంగా టెస్టులు విధిగా జరపాలని, కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేసి టెస్టులు, చికిత్స చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. జూమ్‌యాప్ ద్వారా బుధవారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశ వివరాలను రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహకందనంత రీతిలో పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో టెస్టుల సంఖ్య పెంచాలని, ప్రైవేటు ఆసుపత్రులను టెస్టులకు, చికిత్సకు ఉపయోగించాలని గతంలో అఖిలపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని కార్యదర్శివర్గ సమావేశం పేర్కొంది. మాస్కు లు, పిపిఇ కిట్ల లాంటివి మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టులకు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికి పట్టించుకోలేదని, దీంతో వారిలో కూడా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిస్తోందని తెలిపింది. 20న పెట్రో ధరలపై నిరసనలు: పెట్రోల్, డిజీల్ ధరలు వ రుసగా 11 రోజుల నుంచి పెంచుతూ, ఈ 11 రోజుల్లో పెట్రోల్ లీటర్‌కు రూ. 6.02, డీజిల్ రూ. 6.40 మేరకు పెంచడం, కరోనా ప్రబలుతుండగా నే చమురు కంపెనీలు చార్జీలు పెంచుతుంటే, అడ్డుకోకుండా కేంద్ర ప్రభు త్వం ప్రేక్షకపాత్ర వహించడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ స మావేశం విమర్శించింది. మధ్య, పేద తరగతుల ప్రజలపైన భారం మోపడమే అవుతుందని పేర్కొంది. పెట్రోల్, డిజిల్, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జూన్ 20వ తేదీన నిరసన దినంగా పాటించాలని, అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. బొగ్గు గనుల పోరుకు మద్దతు బొగ్గుబ్లాకుల, ఇతర బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు జులై 2న పిలుపునిచ్చిన దేశ వ్యాపిత ఆందోళనకు సంపూర్ణ మద్దతునివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించింది.
ఉచితంగా కరోనా టెస్టులు
RELATED ARTICLES