భారత్‌లో గరిష్ట స్థాయిలో 15,968 కొత్త కేసులు
మరో 465 మంది మృతి, 14,476కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క రోజే రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 15,968 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 465 మంది మృత్యువాతపడ్డా రు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,56,183 కరోనా కేసులు నమోదు కాగా.. 14,476 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో వరుసగా ఐదవ రోజు కూడా 14 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, జూన్ 1వ తేదీ నుంచి 24 వ తేదీ నాటికి 2,65,648 మంది కరోనా బారిన పడ్డారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని 2,58,685 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,83,022 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 56.71గా ఉన్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మృత్యుకేళి
మహారాష్ట్రలో కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క రోజే 248 మంది కరోనా కాటుకు బలయ్యారు. కొవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,531కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,39,010 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 68 మంది మృతి చెందగా, మొత్తం మృతులు 2,301కి పెరిగారు. కొత్త కేసులు గణనీయంగా నమోదయాయ్యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,602గా ఉంది. తమిళనాడులోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 64,603 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 39 మంది మరణించారు. మొత్త మృతుల సంఖ్య 833కు చేరింది. గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 28,371ఉండగా, కొత్తగా 26 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 1,710మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో 18,893 కేసులు నమోదు కాగా, కొత్తగా 19 మరణించడంతో మృతుల సంఖ్య 588కి చేరింది.
ఇప్పటి వరకు 7.5 లక్షల శాంపిళ్లు పరీక్ష
ఈనెల 23వ తేదీ నాటికి 73.5 లక్షలకు పైగా శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించామని, మంగళవారం ఒక్క రోజే 2.15 లక్షల నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది. వైరస్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజే ఇంత పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించడం ఇదే ప్రథమమని పేర్కొంది. కొవిడ్ గుర్తిం చే సమార్థ్యాన్ని పెంచడంలో భాగంగా మంగళవారం 1000వ పరీక్ష ప్ర యోగశాలకు ఐసిఎంఆర్ అనుమతించింది. ప్రస్తుతం దేశంలో రోజుకు మూడు లక్షల శాంపిళ్లకు పరీక్షలు జరుపుతున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీ నాటికి దేశంలో మొత్తం 73,52,911 నమూనాలను పరీక్షించారు. అందులో మంగళవారం ఒక్క రోజే 2,15,195 శాంపిళ్లకు పరీక్షలు చేసినట్లు ఐసిఎంఆర్ చెప్పింది. 1000 టెస్టింగ్ ల్యాబ్‌లకు గానూ 730 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా మరో 270 ప్రైవేట్‌వి.
మహమ్మారితో తృణమూల్ ఎంఎల్‌ఎ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్‌తో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. గత నెలలో ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత నుంచి ఆ సుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తమోనాశ్ మృతి పట్ల టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘35 ఏళ్ల పాటు ప్రజలు, పార్టీ కోసం తమోనాశ్ పని చే శారు. ఆయన లేని లోటు పూడ్చుకోలేం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ మమతా ట్వీట్ చేశారు. పార్టీ తరఫున ఫాల్తా నియోజకవర్గం నుంచి తమోనాశ్ మూడు సార్లు ఎంఎల్‌ఎ ఎన్నికయ్యారు. 1998 నుంచి టిఎంసి ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కరోనాతో ఢిల్లీ డాక్టర్ మృతి
దేశాన్ని కరోనా భూతం గజగజలాడిస్తోంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ 49ఏళ్ల డాక్టర్ కరోనాతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కారట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న డాక్టర్ యాసిర్ నసీమ్.. కరోనాకు బలయ్యారు. చికిత్స సమయంలో వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. ‘ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు కనీసం మా మాటలు కూడా ఆయనకు వినిపించడం లేదు. ఆయన డయాబెటిక్ అని ఆ తర్వాత తెలిసింది’ అని వైద్యులు తెలిపారు.
ఉగ్ర రూపం
RELATED ARTICLES