సియోల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ
సియోల్ : ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించేందుకు ఇక్కడకు వచ్చిన మోడీ దక్షిణకొరియాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయే ఇన్‌తో జరిపిన సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. విశ్వ శాంతి, భద్రతకు ఉగ్రవాదం అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని, ఒకటి రెండు దేశాలు ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, అలాగే ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సహకారాన్ని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇందుకోసం ప్రపంచ సియోల్ : ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సియోల్ శాంతి పురస్కారాన్ని స్వీకరించేందుకు ఇక్కడకు వచ్చిన మోడీ దక్షిణకొరియాలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయే ఇన్‌తో జరిపిన సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. విశ్వ శాంతి, భద్రతకు ఉగ్రవాదం అతిపెద్ద సవాల్‌గా పరిణమించిందని, ఒకటి రెండు దేశాలు ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇతర దేశాలకు ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, అలాగే ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సహకారాన్ని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు తీసుకోవాలని కోరారు. కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో భారత్‌కు చెందిన 40 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో భారత్‌కు దక్షిణ కొరియా ఇచ్చిన మద్దతుకు మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదం తరచూ భారత్ వంటి దేశాలను ఇబ్బంది పెడుతున్నదని, దీనిపై సమైక్య చర్య అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద శక్తులకు పాకిస్థాన్ స్వర్గధామంగా వుందని అన్నారు. ఎల్లలతో నిమిత్తం లేకుండా ప్రతి దేశం ఏదో ఒకరూపంలో ఈ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు మానవత్వంతో చేతులు కలిపి, ఉగ్రవాద వ్యవస్థలను నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు.