కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
జైపూర్/భన్సూర్: ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఒంటరిగా ఎదుర్కోనలేకపోతే భారత్ సహాయం కోరవచ్చని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజ్‌నాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్ఘానిస్థాన్‌లో తాలిబన్లు,ఉగ్రవాదులపై పోరాడేందుకు ఆ దేశం అమెరికా సహకారం తీసుకుందని, పాకిస్థాన్ కూడా తాను ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేమని భావిస్తే ఆప్ఘానిస్థాన్ అమెరికా సహాయం కోరిన విధంగానే పాక్ భారత్ సహకారాన్ని కోరవచ్చని తెలిపారు. జమ్మూ,కాశ్మీర్ అంశం అనేది సమస్య కాదని, ఉగ్రవాదమే అసలైన సమస్య అ ని చెప్పారు. కానీ, పాకిస్థాన్ జమ్ము,కాశ్మీర్ అం శాన్ని తెరపైకి తెచ్చి ఉగ్రవాదంపై చర్చను పక్కన పెడుతుందని విమర్శించారు. అయితే జమ్మూ, కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉం టుందని స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎన్‌డిఎ అందించిన పాలన చాలా బాగుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఇప్ప టి వరకు చెప్పుకోదగ్గ ఉగ్రవాద దాడులు జరగలేదని వెల్లడించారు. ఉగ్రవాదం అనేది కాశ్మీర్‌కు మాత్రమే పరితమైందని, ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు చక్కబడుతున్నాయని అన్నారు. అలాగే జ మ్మూ, కాశ్మీర్‌లో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉగ్రవా దం విషయానికి వస్తే అది మూమ్మాటికీ పాకిస్థాన్ సహకారంతో జరుగుతున్నదేనని… ఇందు లో రెండో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేశా రు. దేశ సరిహద్దు భూభాగాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయని, ఉగ్రవాదాన్ని క్రమంగా తగ్గించగల్గామని వెల్లడించారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో నక్సలిజం సమస్య కూడా పూర్తి అంతమవుతుందని పేర్కొన్నారు. ఒక్కప్పుడు నక్సలిజం 90 జిల్లాల్లో తన ప్రభావాన్ని చూపించేదని… కానీ, ఇప్పుడు దాని ఎఫెక్ట్ కేవలం 8,9 జిల్లాలకే పరిమితమైందన్నారు. ఇక కాంగ్రెస్ నేతల ఆలయాల సందర్శనపై హోంమంత్రి రాజ్‌నాథ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలు సమీపించినప్పుడే ఆలయాలు గుర్తుకు వస్తాయని… కానీ, బిజెపికి అలాంటీ అలవాటు లేద ని, ఆలయాల దర్శనమనేది తమ పార్టీ సంస్కృతిలో అంతర్భాగమని తెలిపారు. కాంగ్రెస్ నేతల ను ఇంతకు ముందెన్నడూ ఇలా ఆలయాలను ద ర్శించుకోవడం చూడలేదని పేర్కొన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ అభివృద్ధి అట్టడుగు స్థా యిలో ఉందని, ఆ పార్టీ ప్రజలను ఏళ్ల పాటు మో సగించి పాలించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్‌లో అభివృద్ధి ఏం జరగలేదని, బిజెపి అధికారంలోకి వచ్చిన వెంట నే ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆధ్వర్యంలో అభివృద్ధి మెరుగుపడింద న్నారు. 50 ఏళ్లలో రా జస్థాన్‌లో కాంగ్రెస్ కేవలం 103 ఐటిఐలు ఏర్పాటు చేస్తే… బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలోనే 958 కొత్త ఐటిఐలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై పోరాడేందుకు పాక్.. భారత్ సాయం కోరొచ్చు
RELATED ARTICLES