జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఒక ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి దొంగ దెబ్బ తీశారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో కెపి రోడ్డు వద్ద సిఆర్‌పిఎఫ్ గస్తీ బృందంపై బుధవారం సాయంత్రం దాడికి దిగారు. ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరుపుతూ, గ్రనేడ్లు విసిరారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఎకె సిరీస్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, అనంత్‌నాగ్ బస్‌స్టాప్ సమీపంలో కెపి చౌక్ వద్ద 116 బెటాలియన్ గస్తీ తిరుగుతుండగా ఉగ్రవాదులు ఈ కాల్పులకు దిగినట్టు సిఆర్‌పిఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.