నాంది వంటి సూపర్ హిట్ తర్వాత, నటుడు అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మళ్లీ ఉగ్రం సినిమా కోసం చేతులు కలిపారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అల్లరి నరేష్ అద్భు తమైన మేకోవర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. టీమ్ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన మొదటి సింగిల్ దేవేరిని విడుదల చేసింది. లిరిక్స్, కంపోజిషన్ చాలా బాగున్నాయి. ప్రేక్షకులను ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది. సంగీత స్వ రకర్త శ్రీచరణ్ పాకాల అద్భుతమైన, రొమాంటిక్ నంబర్‌ను అందించారు. అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. శ్రీమణి సాహిత్యం చాలా బాగుంది. ప్రధాన జంట అల్లరి నరేష్, మర్నా తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రా నికి కథను తూమ్ వెంకట్ అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్, సిద్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
‘ఉగ్రం’ నుండి దేవేరి సాంగ్ రిలీజ్!
RELATED ARTICLES