HomeNewsBreaking Newsఉక్రేన్‌కు అణ్వాయుధాలు మాకు ప్రమాదకరం

ఉక్రేన్‌కు అణ్వాయుధాలు మాకు ప్రమాదకరం

రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ స్పష్టీకరణ
మూడో ప్రపంచ యుద్ధం విధ్వంసకరమని వ్యాఖ్య
మాస్కో: ఉక్రేన్‌ అణ్వాయుధాలను సేకరిస్తే, తమ కు ఎక్కువ ప్రమాదమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వ్యాఖ్యానించారు. అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. లావ్రోవ్‌ను ఉటంకిస్తూ స్థానిక మీడియా చేసిన ప్రకటనను అనుసరించి, ఒకవేళ మూడో ప్రపంచ యు ద్ధం వస్తే, అది పూర్తిగా అణ్వాయుధాల పోరాటంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అణుయుద్ధం వల్ల విధ్వంసం తప్పదని అన్నారు. ఉక్రేన్‌ అణ్వాయుధాలు సేకరించుకునే అవకాశం ఇవ్వబోమని అన్నారు. ఆంక్షలను సమర్థంగా ఎదుర్కొంటామని, తమ దేశ భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. సాంస్కృతిక రంగంపైన కూడా ఆంక్షలు విధించడం దారుణమని వ్యాఖ్యానించారు. రష్యా అథ్లెట్లు, విలేఖరులపై ఆంక్షలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
భారత్‌పై ప్రభావం ఉండదు : రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత వాయుసేనపై పెద్దగా ఉండదని ఎయిర్‌ ఫోర్స్‌ వైస్‌ చీఫ్‌ మార్షల్‌ సందీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా, రష్యా దేశాలతో భారత్‌కు మైత్రీ సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. పరిస్థితులను సమీక్షిస్తున్నామని, సవాళ్లను ఎదుర్కొంటామని అన్నారు. ఉక్రేన్‌లో చిక్కుకున్న తిరిగి రప్పించేందుకు మూడు విమానాలు పంపామని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments