2020 నాటికి 52 లక్షల మెట్రిక్ టన్నులకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
ప్రస్తుతం 28 లక్షల మెట్రిక్ టన్నులకు ఈ వేస్ట్ చేరిక !
ప్రజాపక్షం / హైదరాబాద్:ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థా లు పర్యావరణానికి పెను ముప్పుగా వాటిల్లనున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత కంప్యూటర్ ఉపకరణాల మొదలుకుని సెల్ ఫోన్లు, టివీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వరకుగృహోపకరణాలు మరమ్మత్తు కూడా చేయలేని స్థాయిలో చెడిపోతే ఎక్కడో చోట రోడ్డు పక్కన పారవేసి చేతులు దులుపుకుంటుంటాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ-వేస్ట్‌ను పారబోయడం వల్ల పర్యావరణ సమస్యలు అదే స్థాయిలో చవిచూడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాడై పోయిన కంప్యూటర్లు , కీ బోర్డులే కదా అంటూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో 2020 నాటికి దాదా పు 52 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ-వ్యర్థాలు పోగయ్యే ప్రమాదముందని అంచనా. ప్రస్తుతం ఇది 28 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అంతే కాదు, భారతదేశంలో దాదాపు 76 శాతం ఈ వ్యర్థాలు కార్మికులకు శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు. సురక్షితంగా తగిన రీతిలో ఈ- వ్యర్థాలను రీ సైకి ల్ చేయడం వల్ల గాలి, నీరు,వాతావరణ, భూగర్భ జల కాలుష్యం తగ్గించవచ్చని అంటున్నారు.ఎలక్ట్రానిక్ వ్యర్థా ల వల్ల కలిగే పర్యావరణ ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సి ఉందంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యధికంగా ఈ – వ్యర్థాల ను ఉత్పత్తి చేస్తున్న ఐదవ దేశం ఇండియానే అని గుర్తించారు. 2016లో ఇది 2 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలను ఉత్పి త్తి చేసిందని, ఇక్కడ ఉత్పిత్తి అవుతున్నంత ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ప్రపంచ దేశాల్లోని ఇతర దేశాల్లో కూడా ఈ స్థాయిలో ఉండక పోవచ్చని పర్యావరణ వేత్తలు విశ్లేషిస్తున్నారు. భారత్‌లోని ఈ – వేస్ట్‌లో ఏటా కేవలం 15 శాతం మాత్రమే తగిన రీతిలో పునరుత్పత్తి చేస్తున్నారని, ఈ- వేస్ట్ రీ సైక్లింగ్ పట్ల సరైన అవగాహన లేక పోవడమే ఇందు కు ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీ సైక్లింగ్‌తో పాటు అసంఘటితర రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు.