ఎన్నికల హామీలకు అనుగుణంగా నిధులు
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
హైదరాబాద్ : ఈసారి రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంటా (మధ్యంతర బడ్జెట్)? లేదా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా? అనే మీమాంసకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలలో ప్రజల కిచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా రాష్ర్ట బడ్జెట్ రూపకల్పన జరగాలని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించా రు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అవ సరమైన నిధుల కేటాయింపు జరగాలని చెప్పారు. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ తరుఫున ప్రజలకు పలు హామీలు ఇచ్చామని, వాటన్నంటినీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం చెప్పారు. హామీల అమల జరిగే విధం గా బడ్జెట్ రూపకల్పన జరగాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మా ణం శరవేగంగా జరుగుతున్నదని, వాటికి నిధుల కొరత లేని విధంగా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక సలహాదారు జి.ఆర్.రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక ష్ణ రావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యద ర్శి వికాస్ రాజ్, నీటి పారుదల శాఖ ఇ.ఎన్.సి.మురళీధర్, ఆర్ అండ్ బి ఇఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు
ఈసారి మధ్యంతర బడ్జెటే
RELATED ARTICLES