ఆరోపణలపై విచారణకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ భూకబ్జాల ఉచ్చు బిగిస్తోంది. భూకబ్జాల కేసులో ఆయన ఇరుక్కుంటున్నారు. భూకబ్జాలపై తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మరో ఫిర్యాదు అందిం ది. ఈ సారి ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై ఒక బాధితుడు సిఎంకు ఫిర్యాదు చేశా రు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్.. భూకబ్జాపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని, ఎసిబి, విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదివారం ఆదేశించారు. ఈటల రాజేందర్‌పై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో భూకబ్జా ఆరోపణలతో మొదలైన వివాదం షామీర్‌పేటమండలంలోని దేవరయాంజాల్ సీతారామ దేవాలయం భూముల వరకు వెళ్లింది. ఈ రెండు భూ వివాదాలపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఆ వివాదం కొనసాగుతుండగానే ఈటల భూ కబ్జా వ్యవహారంలో సిఎంకు మరో ఫిర్యాదు అందింది. ఈటల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ ఈనెల 19న సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు.
నాకు న్యాయం చేయండి: పీట్ల మహేష్
తన భూమిని ఈటల నితిన్‌రెడ్డి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సిఎంకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మండలం రావల్‌కోల్ గ్రామంలోని సర్వే నంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉన్నదని, తన భూమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి, తనను తన భూమిపైకి రాకుండా ఈటల నితిన్‌రెడ్డి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1975- సీలింగ్ యాక్ట్ ప్రకారం తన తాను పిటిగా ధృవీకరిస్తూ నాటి ప్రభుత్వం 38(ఇ) సర్టిఫికెట్‌ను కూడా జారీ చేసిందని, 1954 ఖాస్రా పహాణీ నుంచి 1986 ఆడంగల్ పహాణీ వరకు రెవెన్యూ రికార్డుల్లో ఈభూమి తన తాత పీట్ల నర్సింహ్మ పేరుతో ఉన్నదని వివరించారు. కానీ 1986 తర్వాత సత్యం రామలింగరాజు అండ్ అదర్స్‌కు చెందిన వ్యక్తుల పేర్లతో పహాణీలో నమోదు అయినట్టు వివరించారు. దీనిని తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, కానీ అప్పటి రెవెన్యూ అధికారులు తమకు సహకరించలేదని, తమ భూమి సంబంధించి ఇనాం భూమిగా పత్రాలను సృష్టించి కొనుగోలు చేసినట్టు తెలిసిందని పిట్ల మహేష్ తెలిపారు. తాను గొడవ చేయగా భూమి సెటిల్‌మెంట్ చేసుకుందామని కారులో తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారని, తన వద్ద ఉన్న పత్రాలను చింపేశారని ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ తాను మళ్లీ కలెక్టర్, ఆర్‌డిఒ, తహసీల్దార్ నుంచి తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలను సేకరించానని వివరించారు. ఐదారేళ్ల సమయంలో తన తాత భూములను మళ్లీ ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్‌రెడ్డి, సాదా కేశవరెడ్డి కొనుగోలు చేశారని, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను కూడా వారు పొందారని తెలిపారు. ఈ విషయమై తాను ఈటల రాజేందర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తన గోడును వెల్లబోసుకున్నప్పటికీ కనికరించలేదని పేర్కొన్నారు.
ఈటల కుమారుడి భూ కబ్జా!
RELATED ARTICLES