ప్రజాపక్షం/హైదరాబాద్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్‌రెడ్డి భూకబ్జాపై అధికారులు సోమవారం విచారణ ప్రారంభించారు. ‘ఈటల భూకబ్జా’పై విచారణచేపట్టి సమగ్ర నివేదిక అందజేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం రం గంలోకి దిగింది. మేడ్చల్ తహసీల్దార్ గీత ఆధ్వర్యంలో ఇంటలీజెన్స్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బృందం విచారణ చేపట్టింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మం డలం రావల్‌కోల్ గ్రామంలోని సర్వే నంబర్ 77లో ఉన్న 10 ఎకరాల 11 గంటల భూమి ని అధికార బృందం పరిశీలించింది. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల బృందం పలు పత్రాలతో పాటు తదితర అం శాలపై ఆరా తీశారు. కాగా ఫిర్యాదుదారు డు మహేష్ ముదిరాజ్‌ను మేడ్చల్ తహసీల్దా రు కార్యాలయంలో పలు అంశాలపై విచారించారు. భూములకు సంబంధించిన పలు అంశాలు, పత్రాలను పరిశీలించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగామాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన సంస్థలపై వచ్చిన భూకబ్జా వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఐఎఎస్ అధికారుల బృందంతో ఆగమేఘాలపై విచారణ చేపట్టింది. ఆ విచారణపై ఈటల సంస్థలు హైకోర్టును ఆశ్రయించగా కొవిడ్ వ్యాప్తి పెద్ద ఎత్తున ఉన్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో విచారణ జరపడం అవసరమా అని కోర్టు ప్రశ్నించింది. తాజాగా ఈటల కుమారిడిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై కూడా ప్రభుత్వం అదే విధంగా స్పందించింది. కాగా మరోసారి ఈటల కుమారుడు కూడా కోర్టును ఆశ్రయిస్తారని ఈటల అనుచరులు అంటున్నారు. ఈటలపై కక్ష సాధింపుతోనే అనామకులు ఆయనపై చేసే భూకబ్జా ఫిర్యాదులపై ప్రభుత్వం ఆగమేఘాలపై విచారణలు జరుపుతున్నదని ఈటల అనుచరులు అంటున్నారు.
ఈటల కుమారుడి భూకబ్జాపై విచారణ షురూ
RELATED ARTICLES