పొంచివున్న ఈ -వేస్ట్ ము ప్పు
ప్రధాన నగరాల్లో పర్యావరణంపై పెను ప్రభావం
శాస్త్రీయ పద్ధ్దతిలో నాశనం చేయాలని ఐటి శాఖ సూచన
పట్టించుకోని ఐటి కంపెనీలు, సంస్థలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో (ఈ -వేస్ట్ ) సమాజానికి పెను ము ప్పు వాటిల్లుతోంది. పాడైపోయిన కంప్యూటర్లు, వాటి విడి భాగాలు, మ్బుల్ ఫోన్లు, గృహోపకరణాలైన టివిలు, రిఫ్రిజిరేటర్లు వంటి వాటిని పర్యావరణానికి హాని కల్గకుండా ఆ వ్యర్థాలను నాశనం చేయడం ఒక సవాల్‌గా మారుతోంది. ఇలాంటి వ్యర్థాలను పార వేయడానికి మన రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ సరైన సదుపాయా లు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నగర శివార్లతో ఎక్కడ పడితే అక్కడ ఆరుబయటే పారవేడయం వల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణంపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈవేస్ట్ వ్యర్థాలు భారీ పేరుకుపోతున్న దేశాల్లో భారత్‌తో పాటు చైనా, యూఎస్‌ఏ, జపాన్, జర్మనీ కూడా ఉన్నట్లు ఇటీవలే అసోచామ్- ఎన్‌ఈసీ అధ్యయనం వెల్లడించడం గమనార్హం. అభివృద్ధి చెందిన ఈ దేశాలకు భారత్ కూడా ఏ మాత్రం తీసిపోవడం లేదు. దేశంలో ఈ వ్యర్ధాలను నగరాల్లో రహదారులపైనే పారేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ( ఏటా 47,810 టన్నులు ) ఉంది . ఈ మొత్తంలో రీ సైకిల్ చేస్తున్నది కేవలం 19.8 శాతం మాత్రమే. ఇక రెండో స్థానంలో తమిళనాడు ( ఏటా 52,427 టన్నులు ) ఈ వ్యర్థాలను పారేస్తుండగా (13 శాతం రీసైక్లింగ్ ) చేస్తున్నారు. మూడో స్థానంలో ఉత్తర ప్రదేశ్ 86,130 టన్నుల ఉత్పత్తి చేసి 10 శాతం రీసైక్లింగ్ చేస్తోంది. వరుస క్రమంలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, గుజరాత్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్లు పర్యావరణ వేత్తలు విశ్లేషిస్తున్నారు. 2017 ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ మేనేజ్‌మంట్ పాలసీని ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ వ్యర్థాలను నగరాలకు దూరంగా తరలించి వాటిని భూగర్భంలో పాతి పెట్టాలని, కనీసం 20 మీటర్ల పొడవు, అంతే వెడల్పుతో గుంతలనుతీసి వాటిని శాస్త్రీయంగా నాశనం చేయాలని సూచించింది. కాగితం, జనపనార లాంటి వస్తువులను రీ సైక్లింగ్ చేస్తున్నంతగా ఈ – వేస్ట్‌ను అలా రీసైకిల్ చేయడం కుదరదని, అందుకే పర్యావరణానికి హాని కల్గకుండా దాన్ని సురక్షిత విధానాల్లో నాశనం చేయాలని సూచించింది. అయినా కూడా ఐటి సంస్థలు, ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరర్స్ కంపెనీలు వ్యర్థాలను నగర శివార్లకు తరలించి రాత్రి వేళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనా పారేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కారు ఈ వ్యర్ధాలపై కదిలినా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ‘ ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణ వైపరీత్యాలు ’ అనే అంశంపై 2019 ఏడాదంతా వివిధ నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రచారం కూడా చేయించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ( సిఐఐ), మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఎంఏఐటి) వంటి సంస్థలను భాగస్వామ్యం చేసుకుని “ క్లీన్ టు గ్రీన్ ” అనే కార్యక్రమాన్ని చేపట్టింది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇటీవల స్వచ్చభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ నగరాలను పరిశుభ్రంగా ఉంచాలని దేశ ప్రజానీకానికి సందేశం ఇచ్చారు. క్లీన్ టు గ్రీన్ క్యాంపెయిన్ 26 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 30 నగరాల్లో ఈ నెల డిసెంబర్ 31 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.