ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డి3 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన ఎస్‌ఎస్‌ఎల్‌విడి 3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఇఒఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఇఒఎస్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ (ఇఒఐఆర్) పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రా-రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం మరొక ఘనత సాధించింది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి డి3ని ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (ఇఒఎస్-08)ని ఇస్రో నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారం పంపిస్తుంది. ప్రకృతి విపత్తులతో పాటు అగ్ని పర్వతాలను కూడా ఈ శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం సాగింది. ఈ ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఇఒఎస్-08తో ఈ మూడవ అభివృద్ధి ఫ్లైట్ ఎల్‌వి డి3 లక్షాన్ని సాధించింది. ముందు నిర్ణయించిన ప్రకారమే నిర్దేశిత కక్షలో ఎస్‌ఎస్‌ఎల్‌విని రాకెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఎటువంటి మళ్లింపులూ లేవు’ అని చెప్పారు. ఉపగ్రహం ప్రయోగ కొలమానాలు ప్రతిదీ పక్కాగా ఉందని సూచిస్తున్నాయని, భూ పరిశీలన ఉపగ్రహం, ప్యాసింజర్ ఉపగ్రహం ఎస్‌ఆర్-ఒ డెమోశాట్ నిర్దేశిత విన్యాసాల అనంతరం కక్షలోకి ప్రవేశపెట్టడమైందని ఆయన తెలియజేశారు. ‘ఎల్‌వి డి3 ప్రాజెక్ట్ బృందానికి అభినందనలు. దీనితో ఈ మూడవ అభివృద్ధి ఫ్లైట్ ఎల్‌వి పూర్తి అయింది’ అని సోమనాథ్ చెప్పారు. ‘పరిశ్రమలకు ఎల్‌వి టెక్నాలజీల బదలీ ప్రక్రియలో ఉన్నా. అందువల్ల ఇది ఎల్‌వికి, ప్రయోగ నౌకకు శుభారంభం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఇది 100 శాతం జయప్రదం. ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడమైంది’ అని సోమనాథ్ ఆ తరువాత విలేకరులతో చెప్పారు. ఇఒఎస్‌ను యుఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారె్‌డ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రారెడ్‌లో చిత్రాలు తీస్తుంది. ఈ శాటిలైట్ పంపించే సమాచారం విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ అభినందించారు. ఎస్‌ఎస్‌ఎల్‌విడి 3 ప్రయోగం విజయంవతం పట్ల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు. ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇస్రో మరో ఘనత
RELATED ARTICLES