ట్యాంపరింగ్‌పై పూర్తి ఆధారాలు బయటపెడతామంటున్న కాంగ్రెస్ నేతలు
త్వరలో ‘బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ పేపర్’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్న పార్టీ
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో ఉపయోగించిన ఇవిఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఈ అంశంపై కోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక నుంచి ఇవిఎంలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ ‘బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ పేపర్’ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి మాజీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, జెట్టి కుసుమ్ కుమార్ తదితర నాయకుల ఆధ్వర్యంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశం సందర్భం గా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశ అనంతరం టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు మీడియాతో మాట్లాడుతూ బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ పేపర్ అనే నినాదంతో సుప్రీంకోర్టు, హైకోర్టు తలుపులు తడుతామని చెప్పారు. దీంతో పాటు పార్లమెంట్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పా టు కోసం పట్టుబడుతామని ఆయన పేర్కొన్నా రు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తు న ఎన్నికల సంఘం, టిఆర్‌ఎస్ పార్టీ పాల్పడ్డ అవకతవకలను సమావేశంలో ప్రస్తావించామ ని, అన్ని ఆధారాలను మీడియాతో సహ కేంద్ర ఎన్నికల సంఘానికి త్వరలోనే బయటపెడుతామన్నారు. దాదాపు 22 లక్షల ఓట్లను నిర్ధాక్షిణ్యంగా, కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగించడం పట్ల సమావేశంలో పాల్గొన్న నేతలు ఖండించారన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : శ్రవణ్
పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను కూడా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కు తీసుకువెళ్లి వారు ఎదుర్కొన్న సమస్యలను నివేదించనున్నామన్నారు. ఒక్కో అభ్యర్థి తమ బాధను వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ మొదలు, పోలీసులు కూడా ఎన్నికల విదానాన్ని ఎలా ఖూనీ చేశారన్న విషయంపై కూలకషంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరిస్తామన్నారు. అలాగే లోక్‌సభలో, రాజ్యసభలో చర్చకు దారితీసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిలతో వత్తిడి తెచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిషన్ కోరుతామని, వాస్తవాలను వెలికి తీసేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.
అధికారుల గోల్ మాల్…
పోలింగ్ శాతం తారుమారు
ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం తమాషా చేసిందన్నారు.ఉదాహరణకు నర్సాపూర్ నియోజకవర్గంలో సునితాలక్ష్మారెడ్డి పోటీచేసిన నియోజకవర్గంలో మధ్యహ్నం 8.83 శాతం పోలింగ్ చూపిన అధికారులు సాయంత్రం 5 గంటలకు 70 శాతం పోలింగ్ అయినట్టు చూపారన్నారు.నిజానికి ఒక్కో ఓటు వేయాలంటే కనీసం నిమిషం నుంచి రెండు నిమిషాల సమయం పడుతుందని కాని ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తం ఎలా సాధ్యమయిందని అనుమానం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల సమయం వరకు పోలింగ్ శాతం ఎంతో చెప్పని అధికారులు తెల్లవారి 90 శాతం నమోదయిందని లెక్కలు చెప్పడం చూస్తుంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న దాన్ని రుజువు చేస్తున్నాయన్నారు.
అలాగే మంచిర్యాల లో కూడా ఇదే తంతు జరిగిందన్నారు. పోలీసులకు బూత్ ల లోకి వెళ్లే అదికారమే లేదని, కాని నాలుగు గంటలకే సమయం 54.75 శాతం నమోదయిందని చెప్పిన అధికారులు 5 గంటలకు 65 శాతంగా చెప్పారని తెల్లవారి అదే అధికారులు 73 శాతంగా డిక్లేర్ చేశారన్నారు. కాని 4 గంటల సమయం వరకు బూ త్ ఏజెంట్లను బలవంతంగా బూత్ నుంచి పోలీసులు వెళ్లగొట్టారన్నారు. ఇలా చాలా నియోజకవర్గంలో అత్యంతదారుణంగా ప్రవర్తించారన్నారు.
ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
ప్రజాస్వామ్యం బతికుండాలంటే తప్పనిసరిగా ఈవిఎంల పనితీరును, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈవిఎంలలో ఉన్న మదర్ బోర్డ్ లను ఏవిధంగా మార్చారో తెలుసుకున్నామని త్వరలోనే అవన్నీ బహిర్గత పరుచనున్నామన్నారు. ప్రజాస్వామ్యం బతికుండాలంటే పేపర్ బాలెట్ రావాల్సిన అవసరముందని అందుకే బ్రింగ్ బ్యాక్ బాలెట్ పేపర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఇప్పడు వచ్చిన తీర్పు కేవలం మిషన్ మాండేట్ మాత్రమేనని పీపుల్స్ మాండేట్ కాదని ఆయన అన్నారు.
ఓట్ల దొంగలు పడ్డారు..అద్దంకి దయాకర్
జిహెచ్‌ఎంసి, వరంగల్, పాలేరులలో ఓట్లను దోచుకున్న తీరులోనే ఎంఎల్‌ఎ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఓట్లను దొంగిలించింది. రజత్‌కుమార్‌కు ఎప్పుడైన ఎలక్షన్ నిర్వహించిన అనుభవం ఉందా..? నా దగ్గర ఇవిఎంలు మొరాయిస్తే అధికారులు పట్టించుకోలేదు.