లండన్: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్లు జెఫ్రీ బాయ్‌కాట్, ఆండ్రూ స్ట్రాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. మాజీ దిగ్గజాలకు బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ ప్రకటించింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కు వీరిద్దరూ అందించిన సేవలకుగాను ఆ దేశ మాజీ ప్రధాని థెరెసా మే ‘సర్’ బిరుదును ప్రదానం చేశారు. ‘నైట్‌హుడ్ పొందిన దిగ్గజాల సరసన సర్ ఆండ్రూ స్ట్రాస్ చేరినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం’ అని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హ్యారిసన్ అన్నారు. ’మైదానంలో సాధించిన విజయాలను పక్కనపెడితే ఆండ్రూస్ట్రాస్ ఈ ఆటలో ఒక అద్భుతమైన వ్యక్తిగా అందరికీ తెలుసు. అతడికి పురస్కారం దక్కడం అందరినీ ఆనందింపజేసింది. సర్ జెఫ్రీ బాయ్‌కాట్‌కు మా హృదయపూర్వక అభినందనలు. సుదీర్ఘ కెరీర్లో ఆయన ఆటపై చూపిన అంకితభావానికి సరైన గౌరవం లభించింది’ అని ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మేకు బాయ్‌కాట్ అంటే చాలా ఇష్టం. టెస్టుల్లో బాయ్‌కాట్ 47.72 సగటుతో 8,114 పరుగులు చేశారు. ఎక్కువ సేపు క్రీజులో పాతుకుపోయి చివర్లో ధారాళంగా పరుగులు చేసేవారు. ఆండ్రూ స్ట్రాస్ 100 టెస్టుల్లో 7,037 పరుగులు చేశాడు. తన సారథ్యంలో 2009, 2010/11 యాషెస్ సిరీసులను కైవసం చేసుకున్నాడు. మైక్ గ్యాటింగ్ తర్వాత ఆసీస్ గడ్డపై యాషెస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 2015 నుంచి 2018 వరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ దేశం ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక సంస్కరణలు అమలు చేసి విజయం సాధించాడు.
ఇద్దరి క్రికెటర్లకు ‘సర్’ ప్రదానం
RELATED ARTICLES