నేనెలా మాట్లాడుతున్నాను… నువెలా మాట్లాడావ్!
సిఎంగా హుందాతనాన్ని కాపాడుకో
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో 3 రాష్ట్రాలు తిరిగి ఏం సాధించావ్
ప్రజాపక్షం/ అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసి న విమర్శలను ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. ఆదివారంనాడు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తనను లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కెసిఆర్ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వుంటూ ఇలా అనాగరికంగా మాట్లాడటమేంటని దుయ్యబట్టారు. “నాకు భాష రాదని అంటున్నారు. ఆయన మాట్లాడిన భాష ఇదేనా? ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో చదివారు మరి! ఆయన నా చేత జైతెలంగాణ అనిపించానని చెబుతున్నారు. ఆయన అనిపించేది ఏమిటి? విభజిస్తానంటే విభజించండి అని చెప్పా…అంతే! కెసిఆర్ నా చేత అన్పించడమేమిటి? నోరుందని పారేసుకోకూడదు. పద్ధతిగా మాట్లాడాలి. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకో! కెసిఆర్ ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి తెలుసుకోండి. 2004లో కాం గ్రెస్‌తో, 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదా? తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పారు. మరి ఏం చేశారు? ఎప్పటికి ఏది దొరికితే అదే కెసిఆర్ మాట్లాడతారు” అని హితవు పలికారు. ఎపిలో మోడీ, జగన్, కెసిఆర్ కలిసి పోటీ చేస్తానంటే చేయండి.. అంతేగానీ దాగుడు మూతలు ఎందుకు అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ మిడిల్ మోడీ అయితే, జగన్ జూనియర్ మోడీ అని ఎద్దేవాచేశారు. తనకు చేసింది చెప్పడమే అలవాటు అని, పద్ధతిలేని రాజకీయాలు ఏనాడు చేయలేదని గుర్తుచేశారు. “హైకోర్టు విభజనను నేను స్వాగతించా. అలాగని వెంటనే వెళ్లమంటే ఎలా? నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్రం కాదా? ఉన్న ఫళంగా వెళ్లమంటే ఎలా వెళ్తాం. నెలరోజులు ఇవ్వాలని అడిగాం. నాలుగు రోజులు ఇస్తే ఎలా సరిపోతుంది. సుప్రీం కోర్టు నాలుగు రోజులు ఇవ్వాలని చెప్పిందా? దాని మీద కెసిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నానని కెసిఆర్ అంటున్నారు. అప్పు డు కెసిఆర్ నాతోనే ఉన్నారుగా. వైశ్రాయ్ ఘటనలో కెసిఆరే సిద్ధాంతకర్త. హరికృష్ణ చనిపోతే రాజకీయాలు చేశానని అంటున్నారు.
ఇదేనా నీ భాష?
RELATED ARTICLES