పలు కార్మిక సంఘాలు ధర్నా
ప్రజాపక్షం / హైదరాబాద్ కార్మిక హక్కులను కాలరాసే విధం గా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌లను, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టి 2021 బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ప్రజాబడ్జెట్‌ను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ పలు కార్మిక సంఘాలు కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం (అంజయ్య భవన్) ఎదుట బుధవారంనాడు ధర్నా నిర్వహించారు. ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టియు, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, టిఆర్‌ఎస్‌కెవి, ఎఐయుటియుసి, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రక్షణ ఫార్మారంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వందలాది మంది పాల్గొన్నారు. కార్మిక సంఘాల ధర్నా సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఆయా కార్మిక సంఘా ల నాయకులు, కార్యకర్తలు జెండాలు చేబూని పెద్దపెట్టున నినదించటంతో కార్మిక శాఖ పరిసర ప్రాంతాలు మారుమ్రోగిపోయాయి. కార్మిక సంఘాల ఐక్యత వర్థిల్లాలి, నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించుకోవాలి, రైతులకు సంకటంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, బడ్జెట్‌ను సవరించి ప్రజా బడ్జెట్‌ను రూపొందించాలని, మోడీ డౌన్‌డౌన్ అంటూ నినదించటంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ ధర్నాలో ఎఐటియుసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ పాల్గొనగా అనంతరం జరిగిన ధర్నానుద్దేశించి ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి కార్పొరేట్ అనుకూల విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందని దానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేందుకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు. వలస కార్మికుల, అసంఘటిత కార్మికుల ఇక్కట్లు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని, ఆదానీ, అంబానీలకే మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని, అందువల్లే ఆదాయం 35% పెరిగిందని ఆయన చెప్పారు. గంటకు 90 కోట్ల ఆదాయం అంబానీకి వస్తుందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ పేరుతో దేశాన్ని మోడీ కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నాలుగు కోడ్‌లు రూపొందించి 90శాతం అధికారం రాష్ట్రానికి అప్పగించారని చెప్పారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ అరుంధతి నక్షత్రంలాగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల ఉద్యమ స్ఫూర్తితో ఉధృతంగా ఐక్య కార్మిక పోరటాలు నిర్వహించి, మోడీ ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌టియుసి నాయకులు నాగన్న మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న 44 చట్టాలను 4 కోడ్‌లుగా చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయటమేనన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి బడ్జెట్ కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ అని స్పష్టం చేశారు. నిరంతరం మోడీ స్వదేశీ జపం చేస్తూ విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడదని ఇది దుర్మార్గమైన బడ్జెట్ అని అన్నారు. హెచ్‌ఎంఎస్ నాయకులు మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వరంగాన్ని విధ్వంసం చేసే విధంగా పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌కెవి ఉపాధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా నిలబడి నాలుగు కోడ్‌లకు వ్యతిరేకంగా పోరు సాగించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్‌టియుసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 99 శాతం ప్రజలకు ఉపయోగపడదని అన్నారు. ఐఎఫ్‌టియు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ పరిశ్రమలను పరిరక్షించుకోవాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సిఐటియు కార్యదర్శి జె.వెంకటేశ్, ఎఐయుటియుసి నాయకులు బాబురావు ప్రసంగించగా సభకు ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యం.నర్సింహ్మా, ఐఎఫ్‌టియు నాయకురాలు అనురాధ, సిఐటియు నాయకులు యం.వెంకటేశ్ అధ్యక్షత వహించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు బి.వెంకటేశం, ఓరుగంటి యాదయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, నాయకులు బొడ్డుపల్లి కిషన్, కమతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, బడ్జెట్‌ను సవరించి ప్రజా బడ్జెట్‌ను రూపొందించాలని, మోడీ డౌన్‌డౌన్ అంటూ నినదించటంతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ ధర్నాలో ఎఐటియుసి కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ పాల్గొనగా అనంతరం జరిగిన ధర్నానుద్దేశించి ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. నాలుగు లేబర్ కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి కార్పొరేట్ అనుకూల విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందని దానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేందుకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని చెప్పారు. వలస కార్మికుల, అసంఘటిత కార్మికుల ఇక్కట్లు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని, ఆదానీ, అంబానీలకే మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని, అందువల్లే ఆదాయం 35% పెరిగిందని ఆయన చెప్పారు. గంటకు 90 కోట్ల ఆదాయం అంబానీకి వస్తుందన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ పేరుతో దేశాన్ని మోడీ కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. నాలుగు కోడ్‌లు రూపొందించి 90శాతం అధికారం రాష్ట్రానికి అప్పగించారని చెప్పారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ అరుంధతి నక్షత్రంలాగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల ఉద్యమ స్ఫూర్తితో ఉధృతంగా ఐక్య కార్మిక పోరటాలు నిర్వహించి, మోడీ ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌టియుసి నాయకులు నాగన్న మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న 44 చట్టాలను 4 కోడ్‌లుగా చేయడం కార్మిక వర్గానికి ద్రోహం చేయటమేనన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి బడ్జెట్ కార్పొరేట్ల అనుకూల బడ్జెట్ అని స్పష్టం చేశారు. నిరంతరం మోడీ స్వదేశీ జపం చేస్తూ విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడదని ఇది దుర్మార్గమైన బడ్జెట్ అని అన్నారు. హెచ్‌ఎంఎస్ నాయకులు మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వరంగాన్ని విధ్వంసం చేసే విధంగా పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌కెవి ఉపాధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా నిలబడి నాలుగు కోడ్‌లకు వ్యతిరేకంగా పోరు సాగించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎఫ్‌టియుసి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 99 శాతం ప్రజలకు ఉపయోగపడదని అన్నారు. ఐఎఫ్‌టియు నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ పరిశ్రమలను పరిరక్షించుకోవాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సిఐటియు కార్యదర్శి జె.వెంకటేశ్, ఎఐయుటియుసి నాయకులు బాబురావు ప్రసంగించగా సభకు ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యం.నర్సింహ్మా, ఐఎఫ్‌టియు నాయకురాలు అనురాధ, సిఐటియు నాయకులు యం.వెంకటేశ్ అధ్యక్షత వహించారు. ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శులు బి.వెంకటేశం, ఓరుగంటి యాదయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పానుగంటి పర్వతాలు, నాయకులు బొడ్డుపల్లి కిషన్, కమతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఇదేం బడ్జెట్
RELATED ARTICLES