సిడ్నీ: భారత క్రికెట్ జట్టు విజయంలో ఛటేశ్వర్ పు జారా పాత్ర ఎక్కువని ఆస్ట్రేలియా లెజెండ్ ఇయాన్ చా పెల్ అన్నారు. ఛటేశ్వర్ పుజారా తన అద్భుతమైన ఆట తీరుతో ఆసీస్ బౌలర్లను మోకరిల్లేలా చేశాడని వ్యాఖ్యానించారు. కోహ్లీ రాజ్యంలో అసాధారణ బ్యాటింగ్‌తో పు జారా ఆకట్టుకున్నాడంటూ చాపెల్ ప్రశంసించారు. నా లుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 సొం తం చేసుకుని ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చాపెల్ స్పందిస్తూ భారతజట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఆసీస్ ఆటతీరు ఎంత దౌర్భాగ్యపరిస్థితిలో వుందో దెప్పిపొడిచారు. ‘భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లి రాజు కావొచ్చు. కానీ.. ఆ రా జ్యంలో పుజారా కూడా ఎన్నో గౌరవాలకి అర్హుడని ని రూపించాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎంతో మం చి జరిగింది. సిరీస్ చేజిక్కించుకోడమే కాదు.. పుజారాలోని పట్టుదల, క్రమశిక్షణ, ఓపిక విలువ బయటపడిం ది’ అని కొనియాడారు. ‘పుజారా అద్భుత బ్యాటింగ్ నుంచి మా జట్టు చాలా నేర్చుకుని ఉంటుంది. సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన పుజారా.. భీకరమైన ఆస్ట్రేలియా బౌలర్లని సైతం అసహనంతో మోకాళ్లపై కూలబడేలా చేశాడు. ఆస్ట్రేలియాలో మూడు సెంచరీలు చేసిన అతడు సునీల్ గావస్కర్ రికార్డును సమం చేశాడు. ఆసీ స్ గడ్డపై ఏడు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధించి 521 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదన్నాడు.