HomeNewsLatest Newsఇజ్రాయిల్‌లో రొడ్డెక్కిన జనం

ఇజ్రాయిల్‌లో రొడ్డెక్కిన జనం

గాజాలో కాల్పుల విరమించాలని ఇజ్రాయిల్‌లో రొడ్డెక్కిన జనం

దేశవ్యాప్త ప్రదర్శనల్లో పాల్గొన్న5 లక్షల మంది
ప్రధానిపై తీవ్ర ఆగ్రహం
సమ్మెకు దిగిన కార్మికులు విమాన, పౌర సేవలకు తీవ్ర విఘాతం

జెరుసలేం : గాజాలో ఆరుగురు బందీల మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ప్రధాని బెంజామి నెతన్యాహూపై ప్రజల్లో తీవ్ర ఆగ్ర హం వ్యక్తమవుతోం ది. తక్షణమే కాల్పుల విరమ ణ ఒప్పందం చేసుకోవాలని, బందీలను వెనక్కి ర ప్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం ‘హిస్టాడ్రుట్‌’ సోమవారం ఒక్క రోజు సమ్మెకు దిగింది.సుమారు 8 లక్షల మంది సభ్యులు కలిగిన ఈ కార్మికసంఘం సమ్మెకు భారీ స్పందన లభించింది. వైద్యులు, బ్యాంకు ఉద్యోగులు, విమనాశ్రయ సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో వైద్య సేవలు, రవాణా, బ్యాంకింగ్‌ రం సేవలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ విమానాశ్రయంలో విమనాలు రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం అర్థరాత్రి నుంచే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. టెల్‌ అవీవ్‌లో సుమారు 3 లక్షల మంది, ఇతర నగరాలలో రెండు లక్షల మంది ప్రజలు నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నట్లు ఇజ్రాయిల్‌ మీడియా తెలిపింది. జెరూసలెంలోని ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహూల కార్యాలయం ఎదుట కూడా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పలు చోట్ల వాహనాలను అడ్డుకున్నారు. ప్రదర్శకులపై పలు చోట్ల పోలీసులు వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించారు. ప్రధాని బెంజామిన్‌ నెతాన్యుహూ దుందుడుకు వైఖరితో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని, కాల్పుల విరమణ జరిపి ఉంటే ఆ ఆరుగురు బందీలు సజీవంగానే తిరిగి వచ్చేవారని, బందీల కుటుంబసభ్యులు, స్నేహితులు మండిపడుతున్నారు. సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బెన్‌ గురియోన్‌ అంతర్జాతీయ విమాన్రాశయంలో బైటికి వెళ్ళాల్సిన విమానాలను నిలిపివేశారు. హిస్టాడ్రుట్‌ కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ బ్యాంకులు, పెద్ద మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే వారంతా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. సమ్మెలో ఇంటర్‌ సిటీ రైళ్ళను , ప్రధాన బస్‌ మార్గాలను చేర్చలేదని వెల్లడించారు. పాఠశాలల సమయాలను పలు చోట్ల కుదించారు. కెజి, పబ్లిక్‌ డే కేర్‌లకు సెలవులు ప్రకటించారు. జెరుసలేం సహా అనేక మున్సిపాలిటీలలో అధికార పార్టీ పట్టు ఉన్న చోట సమ్మెకు పాక్షిక స్పందన లభించినట్లు తెలుస్తోంది.
కోర్టు ఆదేశాలతో ముందుగానే ముగిసిన సమ్మె : రాజకీయ ప్రేరేపితమైన సమ్మెను రద్దు చేయాలని కోరుతూ లేబర్‌ కోర్టును సోమవారం నాడు ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తక్షణమే సమ్మెను నిలిపివేయాలని మధ్యాహ్నం 2ః30 గంట సమయంలో ఆదేశించింది. ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చిన హిస్టాడ్రుట్‌ లేపర్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అర్నార్‌ బార్‌ డేవిడ్‌ మాట్లాడుతూ కోర్టు తీర్పును గౌరవిస్తూ అనుకున్న సమయం కంటే 3ః30 గంటల ముందే సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మెను రాజకీయ ప్రేరేపితమని ప్రచారం చేసినప్పటికీ లక్షల మంది పౌరులు తమకు మద్దతుగా నిలిచారని, బందీలు ప్రాణాలను పోయేందుకు తాము అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. బందీల కుటుంబ సభ్యుల వేదిక మాత్రం ప్రదర్శనలను కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మొండిగా ముందుకు సాగుతున్న ప్రధాని : ప్రధాని నెతన్యాహూ మాత్రం హమాస్‌పై పూర్తి విజయం సాధించేంత వరకు ఆగేది లేదని ప్రతినబూనారు. మెజారిటీ ఇజ్రాయిలీలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. యుద్ధాన్ని ముగించి, గాజా నుంచి ఇజ్రాయిల్‌ బలగాలను ఉపసంహరించుకొని, ఇజ్రాయిల్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే , తమ వద్ద ఉన్న బందీలను అప్పగిస్తామని హమాస్‌ ప్రతిపాదిస్తుండగా, ఇజ్రాయిల్‌ మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. గత అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ చేసిన మెరుపు దాడిలో 1,139 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. అప్పుడు 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. అందులో నవంబర్‌ మాసంలో కాల్పుల విరమణ సమయాంలో ఇజ్రాయిల్‌ తమవ వద్ద ఉన్న పాలస్తీనా ఖైదీలను అప్పగించడంతో, వంద మందికి పైగా ఇజ్రాయిల్‌ బందీలను ఆ దేశానికి హమాస్‌ అప్పగించింది. ప్రస్తుతం 97 మంది వరకు ఇజ్రాయిలీలు,విదేశీయులు హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నట్లు భావిస్తునానరు. అక్టోబర్‌ 7 తరువాత ఇజ్రాయిల్‌ మిలిటరీ గాజాపై నిర్వహిస్తున్న దాడుల్లో 40,786 మంది పాలస్తీనావసులు మరణించగా, 94,224 మంది క్షతగాత్రులయ్యారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇజ్రాయిల్‌ ప్రధాని ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హమాస్‌ ఆరోపించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments