టి20లకు పగ్గాలు వదులుకోనున్న కోహ్లీ
2023 నుంచి టెస్టులు, వన్డేలకు సారధ్యం
వెలింగ్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏ ఫార్మాట్ అయినా ఎదురే లేదు.. అన్ని ఫార్మాట్లలో తాను ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగాడంటే ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారాల్సిందే.. 2008 లో అరంగేట్రం చేసిన కోహ్లీ… తన కెరీర్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించారు. అయితే, ఇప్పుడు కోహ్లీ చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది.. 2023 వరకూ అన్ని ఫార్మాట్లు ఆడతా.. ఆ తర్వాత ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తాను అంటూ.. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చార కోహ్లీ.. దీంతో, టెస్టు, వన్డేల్లో కొనసాగుతూ.. కోహ్లీ మూడేళ్ల తర్వతా టీ-20లకు గు్‌డ బై చెబుతాడనే ప్రచారం సాగుతోంది. 31 ఏళ్ల విరాట్ కోహ్లీ.. 2008లో భారత క్రికెట్ జట్టులో అరంగేట్రం చేసినప్పటి నుండి 84 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అయితే, వరుస సిరీస్‌లతో టైట్ షెడ్యూల్ మరియు చాలా తక్కువ విరామం దొరికినప్పుడు.. పనిభారంతో నష్టం జరుగుతుందన్నారు కోహ్లీ. వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. మూడేళ్లపాటు నేను అన్ని ఫార్మాటలో ఆడతా.. ఆ తర్వాత వేరే సంభాషణ రావొచ్చు అని తెలిపారు. ఇప్పుడు నేను సంవత్సరానికి 300 రోజులు ఆడుతున్నాను, ఇందులో ప్రయాణం మరియు ప్రాక్టీస్ సెషన్‌లు ఉన్నాయి. దీంతో పని ఒత్తిడి పెరుగుతుందన్నాడు కోహ్లీ.. షెడ్యూల్ మిమ్మల్ని అనుమతించకపోయినా వ్యక్తిగతంగా ఎక్కువ విరామం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామన్నాడు. ముఖ్యంగా అన్ని ఫార్మాట్లను ఆడే కుర్రాళ్ళ కోసం ఇది వర్తిస్తుందన్నారు. కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదు, ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆ తీవ్రత ఉంది. ఇది మీకు చాలా నష్టం కలిగిస్తుందన్నాడు టీ మిండియా కెప్టెన్. నాకు 34 లేదా 35 ఏళ్లు వ చ్చే సరికి నేను వేరే మాట్లాడాల్సి రావొచ్చు అన్నారు.. రాబోయే రెండు, మూడు సంవత్సరాలు నాకు ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పుకొచ్చాడు కోహ్లీ.
ఇక రెండు ఫార్మట్లకే!
RELATED ARTICLES