వరుస విజయాలతో జోరుమీదున్న భారత్, ఇప్పుడు కివీస్‌తో సమరానికి సిద్ధం,
నేడు న్యూజిలాండ్‌తో తొలి వన్డే, ఉదయం 7:30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం
నేపియర్: ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న కోహ్లీ సేన ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ఆసీస్‌ను టెస్టు, వన్డే సిరీస్‌లలో చిత్తు చేసి రెట్టింపైన ఉత్సాహంతో భారత జట్టు కివీస్ పోరుకు సిద్ధమయింది. ఇక్కడ భారత్ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. బుధవారం నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన తర్వాత వన్డే సిరీస్‌నూ సైతం గెలుచుకొని నయా చరిత్ర సృష్టించింది. వరుస విజయాలతో టీమిండియా జోరుమీదుంది. మరోవైపు కివీస్ కూడా ఇటీవలే జరిగిన సిరీస్‌లో శ్రీలంకను వరుసగా మూడు ఫ్రార్మాట్లలో ఓడించి పటిష్ట స్థితిలో ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం భారత్‌కు పెద్ద సవాలే. కానీ ఇప్పుడు భారత్ ఇందుకు అన్ని విధాలుగా సిద్ధమయి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫ్లీల్డింగ్ అన్ని విభాగాల్లో కివీస్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు రెడీగా ఉంది. కానీ న్యూజిలాండ్ భారత్ రికార్డులు పేలవం గాఉన్నాయి. కివీస్ గడ్డపై టీమిండియా 35 వన్డేలు ఆడగా అందులో భారత్ కేవలం 10 మ్యాచుల్లో గెలిచింది. మిగతా వాటిలో ఓటములను చవీచూసింది. 2014 జరిగిన చివరి పర్యటనలో భారత్ ఘోర ఓటములను మూట గట్టుకుంది. వన్డే సిరీస్‌ను 0 తేడాతో కోల్పోయింది. కానీ ఇప్పుడు దానికి ప్రతీకారం తీసుకునేందుకు ఇదే సరైన సమయం. భారత జట్టు గతంలో ఎన్నడు లేనంతగా ఇప్పుడు బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులను చెరిపేసి ఇప్పుడు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ప్రపంచకప్‌కు ముందు విదేశాల్లో భారత్‌కు కివీస్ పర్యటనే చివరిది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తిక్ తదితరులు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌లో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహాల్, ఆల్‌రౌండర్ జడేజాలు మంచి ప్రదర్శనలతో ఆకట్టుకొంటున్నారు. అందరూ కలిసి కట్టుగా రాణిస్తే భారత్‌కు విజయం సులవే. కివీస్ జట్టు ఆటగాళ్లు కూడా భీకర ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ విలియమ్‌సన్, గుప్టిల్, లాథమ్ గ్రాండ్‌హోమ్ రాస్ టేలర్ బలమైన బ్యాటింగ్ దళం ఉంది. ఇక బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ తదితరులు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక ర్యాంక్‌ల పరంగా చూస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉంటే.. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లను తక్కువ అంచనా వేయలేం. రెండు జట్లు కూడా పటిష్టంగా ఉండడంతో ఈ సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఓపెనర్లే కీలకం..
కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఓపెనర్లే కీలకం. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు చెలరేగాల్సిన అవసరం ఉంది. ధావన్ ఆస్ట్రేలియా సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేదు. కానీ తన బ్యాట్‌కు పనిపెట్టాల్సిన సమయం వచ్చేసింది. పటిష్ట కివీస్‌ను నిలువరించలంటే గట్టి పునాది వేయాలి. ఓపెనర్లు ఇద్దరూ గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొలిపి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాలి. అప్పుడే కివీస్‌కు పెద్ద టార్గెట్ నిర్ధేశించగలుగుతాము. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇతను చెలరేగితే పరుగులు ఆపడం ఏ బౌలర్‌కు సాధ్యం కాదు. ఒకసారి ఇతను పిచ్‌పై నిలదొక్కుకుంటే పరుగుల సునామీ ఖాయం. కివీస్ జట్టుకూడా రోహిత్‌ను ఔట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలను అల్లుకుంది. ఏదిఏమైన ఓపెనర్లు రాణిస్తే బారత్ భారీ స్కోరు సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఇక భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను తన ప్రత్యేక ఆటతో అందరిని ఆకర్షించాడు. ప్రపంచ టాప్ బ్యాట్స్‌మెన్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. గత ఏడాది పరుగుల వరద పారించిన కోహ్లీ ఐసిసి తరఫున అన్ని అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా చెలరేగేందుకు కోహ్లీ తన ఆర్మీతో సిద్ధమాయ్యాడు. విదేశీ పర్యటనల్లో కోహ్లీ భారత ప్రధాన బ్యాట్స్‌మన్ పాత్ర పోషిస్తున్నాడు. గత ఏడాది జరిగిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా పర్యటనల్లో సత్తా చాటుకున్న కోహ్లీ తాజాగా ఆసీస్ సిరీస్‌లోనూ తన ప్రతిభను కనబర్చాడు.
ధోనీపైనే అందరి దృష్టి..
ఆస్ట్రేలియా సిరీస్‌లో చెలరేగిన భారత సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింద్ ధోనీ ఇప్పుడు కివీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. గత ఏడాది ఫామ్‌లేమితో సతమతమైన ధోనీ కొత్త సంత్సరంలో మాత్రం సత్తా చాటాడు. ఆసీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు సాధించి భారత్‌కు 2 సిరీస్‌ను అందించాడు. అదే జోరును ఇక్కడ కూడా కొనసాగించాలని ధోనీ దృఢ సంకల్పంతో ఉన్నాడు. ప్రస్తుత భారత జట్టులో ధోనీకి ఉన్నంత అనుభవం ఇతర ఏ ఆటగాడికి లేదు. కివీస్ పిచ్‌లపై ధోనీకి మంచి అవగాహన ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇతర బ్యాట్స్‌మెన్స్‌లో అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, రవీంద్ర జడేజాలు కూడా కీలకం తుది జట్టులో ఎవరికీ చోటు దక్కిన తమ సత్తా చాటుకునేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక భారత బౌలర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫాస్ట్ పిచ్‌లపై బంతిని వేగంగా వేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించే సత్తా అందరికి ఉంది. స్పిన్నర్లు, పేసర్లూ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు అదనపు బలం.
కివీస్‌ను తక్కువగా తీసుకోలేం..
న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు కూడా అంత తేలికకాదని విశ్లేషకులు చేబుతున్నారు. ప్రస్తుతం కివీస్ జట్టు భీకర ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. భారత్‌ను అడ్డుకునేందుకు వారి దగ్గర మంచి అస్త్రాలు అనేకంగా ఉన్నాయి. వరుస విజయాలతో విలియమ్‌సన్ సేనా జోరుమీదుంది. జట్టులో సీనియర్‌లతో పాటు యువ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. అందుకే కివీస్‌ను తక్కువ అంచనా వేయలేము. ఏ సమయంలోనైన మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. కెప్టెన్ విలియమ్‌సన్ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కూడా వరుస శతకాలతో జోరును కనబర్చుతున్నాడు. గుప్టిల్, లాథమ్ తదితరులు బ్యాటింగ్‌లో గొప్పగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ మంచి ప్లేయర్లు అందుబాటులో ఉండడంతో భారత్‌కు గట్టీ సవాల్ ఇచ్చేందుకు న్యూజిలాండ్ జట్టు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది.
ఇక కివీస్ వంతు..
RELATED ARTICLES