ప్రజాపక్షం/హైదరాబాద్ ఇఎస్‌ఐ మెడికల్ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) రూ.144 కోట్లను అటాచ్ చేసింది. ఈ కుంభకోణంలో కీలకపా త్ర పోషించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను సోమవారం అటాచ్ చేసినట్లు ఇడి వెల్లడించింది. ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జెడి పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె. శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్‌రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసిం ది. ఇందులో దేవికారాణికి చెందిన రూ. 17.26 కోట్ల విలువైన ఆస్తు లు, నాగలక్ష్మికి చెందిన రూ.2.45 కోట్ల ఆస్తులు, పద్మకు సంబంధించిన రూ. 74.8 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశా రు. ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబుకు చెందిన రూ.119.89 కోట్లు, పందిరి రాజేశ్వర్‌రెడ్డికి చెందిన రూ.4.7 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. కాగా మొత్తం రూ.211 కోట్లు ఐఎంఎస్ కుంభకోణానికి సంబంధించి ఎసిబి అధికారులు.. ఎనిమిది కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవ ధర కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువకు కొనుగోలు చేసి అక్రమంగా పొందిన లాభాలతో భారీగా నగలు, ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దేవికారాణి, నాగలక్ష్మి పిఎంజె జ్యూవెలర్స్ నుంచి సరైన రశీదులు లేకుండా రూ.6.28 కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసినట్లు అభియోగం నమోదు చేశారు. అయితే నిందితులు కూడబెట్టుకున్న అక్రమాస్తులలో ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, నోయిడాలో 131 స్థిరాస్తులను గుర్తించినట్లు ఇడి తెలిపింది. వాటిలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 వాణిజ్య సముదాయాలు, ఆరు వ్యవసాయ భూములు, 4 ఫ్లాట్లు ఉన్నాయి. సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి చరాస్తులు ఉన్నాయని ఇడి తెలిపింది. ఈ కేసులో మరికొందరు అనుమానితుల మనీలాండరింగ్ ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని ఇడి వెల్లడించింది.
ఇఎస్‌ఐ కుంభకోణంలో… రూ. 144 కోట్లు అటాచ్
RELATED ARTICLES