నేడు ఇంధన వినియోగ దినోత్సవం
న్యూఢిల్లీ: ఇంధన పొదుపు అనే ది కేవలం మన దేశానికేగాక, యావత్ ప్రపంచానికి కూడా
అత్యవసరమైంది. కాలుష్య కారకాల్లో ఇంధనం కూడా ఒకటనేది అందరికీ తెలిసిన సత్యం. పర్యావరణ సమతౌ ల్యం దెబ్బతినడానికి ఇంధన వాడకం ద్వారా వెలువడుతున్న ఉద్ఘారాలు కారణం. అంతేగాక, ఇంధన వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. అత్యవసరాలకు ఉపయోగపడే రీతిలో ఇంధనాన్ని జాగ్రత్త పరచుకొని, వాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది. మంగళవారం దేశం ఇంధన వినియోగ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో, పూర్వాపరాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భూగోళం అగ్నిగుండంగా మారుతున్నదని అంతర్జాతీయ సంస్థలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నాయి. ప్రతి ఏడాదీ ఉష్ణోగ్రతలు పెరగడం మనకు తెలిసిందే. రాజధాని ఢిల్లీలో కాలుష్య సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. కోల్‌కతా వంటి నగరాలు కూడా ఢిల్లీతో పోటీపడుతున్నాయి. వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం, పర్యావరణ కాలు ష్యం, జల కాలుష్యం… ఒకటని ఏమిటి.. అంతటా కాలుష్య సమస్యే. మానవ మనుగడకు సవాలు విసురుతున్న అంశాలే. కాలుష్యానికి వాహనాలు, కొన్ని రకాల యంత్రాల్లో వాడే పెట్రోలు, డీజిల్ నుంచి వెలువడే పొగ ఒక కారణం. అదే విధంగా బొగ్గు, విద్యుత్ వాడకం పరిశ్రమల్లో ఎక్కువగా ఉంది. పెట్రో ఉత్పత్తులతోపాటు, బొగ్గు కూడా పునరుత్పాదక ఇంధన వనరు కాదు. భూమి నుంచి తవ్వి తీసేవి. భూగర్భంలో ఈ వనరులు తరిగిపోవడం భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. ఎలక్ట్రికల్ వాహనాల వాడక ఆవస్యకతను గుర్తుచేస్తున్నది. ప్రపంచ జనాభాలో సుమారు 16 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. కానీ ఇంధన ఉత్పత్తిలో మనది కేవలం ఒక శాతం వాటా మాత్రమే. ఫలితంగా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన పెట్రోల్, డీజిల్, బొగు తదితర ఇంధనాల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాం. అవసరాలకు మించి ఇంధనాలు వాడటంవల్ల వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అం దుకే ఇంధన పొదుపు గురించి ప్రతి ఒక్కరినీ చైతన్య పరచాలి. వీనంత వరకూ ఇంధన వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. 2019 గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16 టెరా వాట్ల విద్యుత్ బొగ్గు, చమురు, సహజ వాయువుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే సూర్యరశ్మి ద్వారా 36 వేల టెరా వాట్ల విద్యుత్, గాలిమరల ద్వారా 80 టెరా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మన దేశంలో 8 వేల కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. సముద్ర తరంగాలు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ దిశగా ప్రయత్నాలు, ఆలోచనలు ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో 415.7 పార్ట్ పర్ మమిలియన్ (పిపియమ్) కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. 250 పిపియమ్ దాటితీనే ప్రమాదం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2014 నుంచి ప్రతీ సెకనుకు వెయ్యి టన్నుల వంతున ప్రాణ వాయువు తగ్గిపోతుంది. ప్రస్తుత వాతావరణంలో 23.5% నుండి 20.9 శాతానికి ఆక్సిజన్ వాతావరణంలో తగ్గుతుంది. ఇదే 19.5% కన్నా తగ్గినా ‘జీవావరణం‘ కనుమాయం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త… అందుకే 2016 ఫ్రాన్స్ ఒప్పందం, ఇటీవల గ్లాస్గో లో జరుగిన ‘కాప్ 26‘ సదస్సు నిర్ణయాలు ప్రపంచ దేశాలు అన్నియు పటిష్టంగా అమలు చేయాలి. లేకపోతే ప్రాణికోటి కి శంకటం… మరియు పెనుప్రమాదం పొంచివుందని అన్ని దేశాలు గ్రహించాలి. అందుకే ప్రముఖ పర్యావరణవేత్త ‘ గ్రేటా థన్ బర్గ్ ‘ మన ఇళ్ళల్లో మంటలు వ్యాపించాయి. అందరూ ఆర్పడానికి ప్రయత్నాలు చేయండి‘ అని అంటున్నారు. అనగా ప్రపంచ దేశాలు అన్నియు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల లాడుతున్నాయి అని తెలిపారు. అక్రమ మైనింగ్ ఆపాలి. పక్రృతి వనరులను దోచుకునే విధానానికి స్వస్తి చెప్పండి. ముఖ్యంగా అడవులను నరుకుట , అటవీ భూముల ఆక్రమణ వంటివి తక్షణమే నిలువరించాలి. మంచు కొండలు కరగకుండా చర్యలు చేపట్టాలి. మొక్కలను పెంచడం ఒక దీక్ష వలే కొనసాగాలి. చెట్లు పెంచడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలి. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం , వనం మనం, జగనన్న పచ్చతోరణం, నగర వన పధకం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వార్థం కోసం, ఆదాయం కోసం కర్బన ఉద్గారాలు విపరీతంగా వాతావరణంలో విడుదల చేయడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న వనరులు రాబోయే 40 సంవత్సరాల నాటికి కనుమరుగవుతున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి. కావున ప్రతీ ఒక్కరూ, అన్ని దేశాలు సోలార్ విద్యుత్, పవన విద్యుత్తు, ఈ- వాహనాలు వినియోగం పెంచాలి. ప్రజలు కూడా చీటికీ మాటకి వాహనాలు వినియోగం చేయకుండా, కాలినడక, సైకిల్ ప్రయాణం ప్రాధాన్యత ఇవ్వాలి.ఆరోగ్యం బాాాాగుంటుంది. .వాడే వాాహనాలు కండిషన్ లో ఉంచుుకోవాలి. ధనం ఆదాతో పాటు ఇంధన ఆదా చేసినవారు అవుతారు. ఇది ఒక దేశసేవగానే భావించవలసి వస్తుంది. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందివ్వాలి. ఇది మన అందరి బాధ్యతగా భావించాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించండి. ప్రత్యామ్నాయ వనరుల వినియోగం పై అవగాహన కల్పించాలి. ఆచరించాలి. అప్పుడే ఇలాంటి ఉత్సవాలకు, దినోత్సవాలకు సార్థకత.
ఇంధన పొదుపు ప్రస్తుత అవసరం..
RELATED ARTICLES