సభ్యులుగా డి.రాజా, డాక్టర్ కె.నారాయణ, రామకృష్ణ పాండా
సిపిఐ జాతీయ సమితి సమావేశం నియామకం
ప్రజాపక్షం/హైదరాబాద్ రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘ఇండియా కూటమి’లో సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సిపిఐ జాతీయ సమితి సమావేశం నియమించింది. ఈ కమిటీ సభ్యులుగా డి.రాజా, డాక్టర్ కె.నారాయణ, రామకృష్ణ పాండా ఉన్నారు. కేంద్ర కార్మిక, సంయక్త్ కిసాన్ మోర్చా నెల 16న చేపట్టిన సమ్మె, గ్రామీణ బంద్‌కు మద్దతు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ జాతీయ సమితి సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సిపిఐ జాతీయ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యాలయ కార్యదర్శి రాయ్కుట్టి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా కార్మి, రైతు, నిరుద్యోగం, వ్యవసాయం వ్యతిరేక, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ప్రస్తావించకుండా కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.కె.కంగో మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రైతుల ఆత్మహత్యలను విస్మరించిందని మండిపడింది. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పండా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు నిషా సిద్దు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, సిపిఐ రాష్ట్ర శాషనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు హాజరవ్వగా దేశ రాజకీయ , ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అభివృద్ధి అంశాలపైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా నివేదికను సమర్పించారు.
బడ్జెట్లో అసమానతలు తొలగించేందుకు చర్యలేవీ?
కేంద్ర బడ్జెట్ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని, అసమానతలను తొలగించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని సిపిఐ జాతీయ సమితి తెలిపింది. బిజెపి-, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం జాతీయ, కార్మిక,రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించింది. దేశాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు మద్దతుగా నిలువాలని కోరింది.ఈ మేరకు సిపిఐ జాతీయ సమితి సమావేశం శనివారం ఒక తీర్మానం చేసింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో (2014- వరకు) 1,00,474 మంది ఆత్మహత్యలు జరిగినట్టు ఎన్‌సిఆర్‌బి నివేదిక వెల్లడించిందనిపేర్కొంది. కార్మికుల వేతనాలు పెరిగాయని కేంద్రం చెప్పడం అబద్ధమని, వాస్తవంగా వారి వేతనాలు తగ్గాయని, దేశంలో అత్యంత ప్రధాన నిరుద్యోగ సమస్యను బడ్జెట్లో ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తంచే సింది. ప్రజల జీవితాలు, జీవనోపాధి అంశంపైన కేంద్ర ప్రభుత్వం నిరంతర దాడులను కొనసాగిస్తోందని, వివిధ చట్టాలు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, విధానపరమైన డ్రైవ్‌ల ద్వారా కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యలను దూకుడుగా కొనసాగిస్తోందని సిపిఐ జాతీయ సమితి సమవేశం తెలిపింది. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాల రాస్తోందని, ఇది వివిధ వర్గాల, అన్ని ప్రజాస్వామ్య వాదనలను, అసమ్మతి గొంతుకలను అణిచివేస్తోందని విమర్శించింది. పరిపాలనను, అధికారాలను, కేంద్ర ఏజెన్సీలను పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని, రాజ్యాంగ సంస్థలను వర్గీకరించే ప్రమాదకరమైన గేమ్ ప్లాన్‌తో కొనసాగుతోందని తెలిపింది. మీడియా, మీడియాలో పనిచేసేవారి స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేరస్తులను రక్షిస్తోందని విమర్శించింది. విద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయని, ఎంజిఎన్ఆర్ఇజిఎకు కేటాయింపులు నిరంతరం తగ్గుతున్నాయని, 2014-15లో మొత్తం బడ్జెట్లో రూ.1.85 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం1.33 శాతానికి పడిపోయిందని తెలిసింది. ప్రస్తుత కేటాయింపులు రూ.86,000 కోట్లు గత సంవత్సరాల కేటాయింపుల కంటే సవరించిన అంచనాల నుండి ఒక చిన్నమొత్తం తప్ప మరోటి ష్పేర్కొంది. నిరుద్యోగ రేటు 8.7 (సిఎంఐఇ) ఉండగా, మహిళల కార్మిక భాగస్వామ్య రేటు కూడా చాలా తక్కువగా నమోదైందని, దాదాపు 60 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని, ఉద్యోగ మార్కెట్ పడిపోయిందని సిపిఐ తెలిపింది.
‘ఇండియా కూటమి’లో సీట్ల సర్దుబాటుపై త్రిసభ్య కమిటీ
RELATED ARTICLES