మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తోన్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ వెండితెరపై తళుక్కున మెరిసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కావడంతో శరీరాకృతిలో వచ్చిన మార్పుల వల్ల కాస్త బొద్దుగా మారిన ఈ భామ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్ట్టారు. ఇందులో భాగంగా ఇటీవల గుర్రపుస్వారీ నేర్చుకొన్న కాజల్ తాజాగా మార్షల్ ఆర్ట్‌పై దృష్టి పెట్టారు. ట్రైనర్ సమక్షంలో తన తదుపరి చిత్రం ‘ఇండియన్ -2’ కోసం చెమటలు చిందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనేది ఓ పురాతన కేరళ యుద్ధ కళ. దీని నుంచే కుంగ్ ఫు, కరాటే, తైక్వాండో వంటి ఎన్నో మార్షల్ ఆర్ట్ పుట్టుకొచ్చాయి. గెరిల్లా యుద్ధానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీన్ని సాధన చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా శక్తిని పొందొచ్చు. గడిచిన మూడేళ్లు నుంచి సమయం దొరికొనప్పుడల్లా దీన్ని నేర్చుకొంటున్నందుకు సంతోషిస్తున్నా’ అని కాజల్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ఆమె హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇక, కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఇండియన్ 2’ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో విడుదలైన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. ఇందులో కమల్‌కు జోడీగా కాజల్ కనిపించనున్నారు. నిర్మాణ సంబంధ విభేదాలు, సెట్‌లో క్రేన్ ప్రమాదం వంటి కారణాల వల్ల సుమారు ఏడాది కాలంపాటు వాయిదా పడిన ఈ సినిమా ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ప్రస్తుతం కమల్ హాసన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
‘ఇండియన్-2’ కోసం చందమామ ఆర్ట్..!
RELATED ARTICLES