సీజనల్ వ్యాధుల భయంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళొద్దు
డెంగీ,మలేరియా వ్యాధుల నివారణకు క్షేత్రస్థాయిలో ఉద్యమంగా పనిచేయాలి
వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల భయంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రలుకు వెళ్లవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. డెంగీ,మలేరియా వ్యాధుల నివారణకు స్థానిక ప్రజాప్రతినిధుల క్షేత్రస్థాయిలో ఒక ఉద్యమంగా పనిచేయాలని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమని తెలిపారు. డెంగీ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా ఉంటున్నందున ఆరోగ్య, కుటుంబ సంక్షే మ కమిషనర్ డాక్టర్ శ్వేతా మహంతిని ప్రత్యకాధికారిగా నియమించినట్టు వెల్లడించారు. కరో నా వ్యాప్తి ప్రబలకుండా ఉండేలా వచ్చే నెల రోజుల్లో ఇంటింటికీ, విద్యా సంస్థలకూ బూస్టర్ డోస్ అందేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వెల్లడించారు. సీజనల్ వ్యాధులపైన హైదరాబాద్‌లోని తాత్కాలిక సచివాలయం బిఆర్కెఆర్ భవన్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కొప్పు ల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌తో కలిసి హరీశ్‌రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యా రు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెంగీ కేసుల నేపథ్యంలో అన్ని రకాల సౌకర్యాలు అం దుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులను ఉపయోగించుకోవాలని కోరారు. గతంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని, కానీ ఐదేళ్ల తర్వాత డెంగీ కేసులు పెరుగుతున్నాయ ని, డెంగీ నివారణలో ప్రజలే కీలకమైని తెలిపా రు. ఇంటి పరిసరాలు, ఇంట్లో నీరు నిల్వ లేకుం డా, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలని, ప్రభుత్వం పంపిణీ చేసిన దోమ తెరలను వాడాలని సూచించారు. దోమతెరలను వాడేలా జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల స్థాయిలో ర్యాపిడ్ కిట్లు, పట్టణాల స్థాయిలో ఆర్టిపిసిఆర్ టెస్టుల కిట్లు అందుబాటులో పెట్టామని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల అనుసంధాన పునరుద్ధరణ కోసం రోడ్లు, భవనాలశాఖకు రూ.10 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.10 కోట్ల నిధులను సిఎం కెసిఆర్ ఇప్పటికే విడుదల చేశారన్నారు.
హాస్టల్స్‌ను తనిఖీ చేసి… అక్కడే భోజనం చేయాలె
సంక్షేమ వసతి గృహాల్లో నీటి, ఆహార కాలుష్యం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వసతి గృహాలను జిల్లా కలెక్టర్లు తనిఖీ చేయాలని, అక్కడి భోజనం తిని చూడాలని సూచించారు. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా హాస్టల్స్‌ను తనిఖీ చేసి, భోజనం, నీటిని తనిఖీ చేయాలని ఆదేశించారు. అక్కడే భోజనం కూడా తినాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ణ్యత ఉండేలా పౌరసరఫరాలశాఖ మంత్రితో పాటు అధికారులు బాధ్యత తీసుకోవాలని, గురుకులాల్లో నాణ్యత లేని బియ్యం ఉంటే వెంటనే వెనక్కి తీసుకుని, నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ను మంత్రి హరీశ్‌రావు కోరార
విమానాశ్రయాల్లో ‘మంకీపాక్స్’ పరీక్ష కేంద్రాలను పెట్టండి
విదేశాల నుండి వస్తున్న వారిలోనే ‘మంకీపాక్స్’ వ్యాపిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిర్ధారణ పరీక్షలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిలోనే మంకీపాక్స్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌ఎంఐడిసి ద్వారా ‘మంకీ పాక్స్’ పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయని,మరిన్ని సేకరిస్తున్నామన్నారు. కువైట్ నుంచి వచ్చిన ఇబ్రహీం నుండి నమూనాలను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు కూడా పంపించామని, గాంధీ ఆసత్రిలో కూడా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, ఒక వేళ మంకీపాక్స్ ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కలిసి తిరిగిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. ప్రజలు ఎవ్వరూ భయందోళన చెందాల్సిన అవసరం లేదని, మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని భరోసా ఇచ్చారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే నోడల్ ఫివర్ ఆస్పత్రిలో చేరాలని సూచించారు. బాగా ఉడకబెట్టని మాంసం, మంకీపాక్స్ సోకిన వ్యక్తి శరీర ద్రవ్యాలు, వాడిన వస్త్రాలను ఇతరులు వేసుకోవడం ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు సమాచారం ఉన్నదని మంత్రి వివరించారు. రాష్ట్రంలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ నిల్వ ఉన్నదని, ఒకవేళ అలాంటి కొరత ఉంటే తీర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇంటింటికీ బూస్టర్‌డోస్
RELATED ARTICLES