ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడి
రెండవ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణత
ప్రజాపక్షం / హైదరాబాద్: ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 60.01 శాతం, రెండవ సంవత్సరం పరీక్షల్లో 68.86 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 75 శాతం, బాలురు 62 శాతం ఉత్తీర్ణత సాధించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశా రు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,80,516 మంది విద్యార్థులు హాజరు కా గా, 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు రెండో స్థా నం దక్కించుకున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,85,323 లక్ష ల మంది విద్యార్థులు హాజరు కాగా, 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానం కైవసం చేసుకుంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థా నం దక్కించుకుంది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతేడాది ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అన్ని జాగ్రత్తలూ తీ సుకుని వాల్యుయేషన్ పూర్తి చేశామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏ ర్పడిన తర్వాత ఈ స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం ఇదే ప్రథమ ని మంత్రి వెల్లడించారు. ఫలితాలను tsbie.cgg.gov.in, bie.telanga na.gov.in వెబ్ సైట్లలో చూడవచ్చని తెలిపారు.