వాల్యుయేషన్ షురూ
హైకోర్టు అనుమతిస్తే 10వ తరగతి పరీక్షలు
బెంచ్‌కు ఒక్క విద్యార్థే
ప్రజాపక్షం / హైదరాబాద్ : పదవ తరగతిలో మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించే ముందు తీసుకుంటున్న జాగ్రత్తలను వివరిస్తూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించా రు. హైకోర్టు అనుమతించిన వెంటనే పరీక్షల తేదీలను ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. పదవతరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ జవా బు పత్రాల మూల్యాంకనంపై గురువారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖాధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ విస్తరించిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో పరీక్షలను నిలిపివేయడంతో ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చేపట్టబోయే ముంద స్తు జాగ్రత్తలను వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నామన్నారు . ప్రస్తు తం ఉన్న 2580 పదవ తరగతి పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు . పెంచుతున్న పరీక్షా కేంద్రాలను, ఆ కేంద్రా ల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. విద్యార్థులతో పాటు పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా మాస్క్‌లు, శానిటిటైజర్లను, థర్మల్ స్క్రీనింగ్ ఏ ర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రతీ రోజూ పరీక్షా కేంద్రాలను కెమికల్ శానిటైజేషన్ చేయనున్నట్లు వివరించారు. ఆనారోగ్యంతో ఉండే విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు వ చ్చే విద్యార్థుల తల్లిదండ్రులు సేద తీరేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఒక్కో బల్లాపై (బెంచీలపై) ఒక్కరే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు .
20వ తేదీకి ఇంటర్ వాల్యుయేషన్ పూర్తి జవాబుపత్రాల వాల్యుయేషన్ చేసే అధ్యాపకులకు రవాణా, భోజన, వైద్య సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. మూల్యాంకనానికి సంబంధించిన ప్రక్రియను గురువారం నుండే ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. మూల్యాంకనం చేసే అ ధ్యాపకుల మధ్య భౌతిక దూరాన్ని పాటించాలనే ఉద్దేశంతో 12 మూల్యాంక న కేంద్రాలను 38 కేంద్రాలకు పెంచుతున్నామని మంత్రి వివరించారు. ప్రతీ మూల్యాంకన కేంద్రంలో 800 నుంచి 707 మంది అధ్యాపకులు మూల్యాంకనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 12 తేదీ వరకు మూల్యాంకన పత్రాలకు సంబంధించిన కోడింగ్ ప్రక్రియను చేపట్టామన్నారు. 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ రెండవ వారంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మూడవ వారంలో మొదటి సంవత్సరం ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు. కరోనా విస్తృతి నేపథ్యంలో మార్చి 23వ తేదీన జరగాల్సిన ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ, మోడల్ లాంగ్వేజెస్ పరీక్షలను ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి వెలడించారు. గతంలో కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి 17 పరీక్షా కేంద్రాలో 861 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యా కమిషనర్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాలు జూన్ 2వ వారంలో
RELATED ARTICLES