HomeNewsBreaking News‘ఇంజినీరింగ్‌' భారం తడిసి మోపెడు…

‘ఇంజినీరింగ్‌’ భారం తడిసి మోపెడు…

కోర్సుల ఫీజులు పెంచుతూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఎఫ్‌ఆర్‌సి సిఫార్సు మేరకు 159 కాలేజీల్లో ఫీజులపై సర్కార్‌ నిర్ణయం
మూడేళ్ల పాటు అమల్లో ఉత్తర్వులు
40 కాలేజీల్లో రూ. లక్ష దాటిన వైనం
రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతేదీ?

ప్రజాపక్షం / హైదరాబాద్‌ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజుల మోత మోగింది. బిటెక్‌తో పాటు ఎంటెక్‌, ఎంబిఎ, ఎంసిఎ ఫీజులు కూడా భారీగా పెరిగా యి. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు రూ.50 వేల నుంచి రూ.85 వేల వరకు ఉన్న ఫీజలు ఎఫ్‌ఆర్‌సి సిఫార్సు మేరకు మొత్తం 159 కాలేజీల్లో 40 కాలేజీల్లో బిటెక్‌ వార్షిక ఫీజలు లక్ష రూపాయలు దాటింది. వాటిలో ఎంజిఐటి రూ.1.60 లక్షలు, సివిఆర్‌ రూ.1.50 లక్షలు, సిబిఐటి, వర్ధమాన్‌, వాసవీ కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ళ పాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా చాలా కళాశాలల్లో అందుకు అనుగుణంగానే ఫీజులు ఉండేవి. కాగా కళాశాలల నిర్వహణ, ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ జీతాలు పెరిగినందున విద్యార్థులు చెల్లించే ఫీజులను కూడా పెంచాలని ఇంజినీరింగ్‌ కళాశాలలు గత కొంత కాలంగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కళాశాలలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. తాజాగా ఎఫ్‌ఆర్‌సి సిపార్సులతో ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫీజులు భారీగానే పెరిగాయి. శుక్రవారం నుండి ఇంజినీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. మరోవైపు ఎంటెక్‌, ఎంబిఎ, ఎంసిఎ కనీస వార్షిక ఫీజులను రూ.27వేలుగా నిర్ణయించారు. ఎంటెక్‌ కనీస ఫీజు రూ.57 వేలుగా ఉత్తరువుల్లో పేర్కొన్నారు. ఫీజులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం పెరుగుతుందా? లేదా? అనే అంశంపై స్పష్టతరావాల్సి ఉన్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments