తిరువనంతపురం: భారత్ ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన అనధికారిక వన్డే సిరీస్ ఆఖరి వన్డేలో ఇంగ్లాండ్ లయన్స్‌కు ఓదార్పు విజయం దక్కింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్న భారత్ ఐదో వన్డేలో చుక్కెదురైంది. బ్యాట్స్‌మెన్స్ వైఫల్యంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 35 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో సిద్దార్థ్ లాడ్ (40 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు), అక్షర్ పటేల్ (23), దీపక్ చాహర్ (21) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో ఒవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ బైలే రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లయన్స్‌కు భారత్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకుపడిన వీరు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ లయన్స్‌ను కట్టడి చేశారు. కానీ బెన్ డకెట్ (70 నాటౌట్; 86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ బ్యాటింగ్‌తో భారత్ విజయాన్ని దూరం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు డకెట్ ఒంటరి పోరాటం చేస్తూ చివరి వరకు అజేయంగా ఉండి లయన్స్‌ను విజయతీరానికి చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ లయన్స్ 30.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తక్కువ స్కోరును సైతం కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. భారత్ బౌలర్లలో దీపక్ చాహర్, రాహుల్ చాహర్ చెరో మూడు వికెట్లు తీయగా.. అక్షర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆలౌరౌండర్ ప్రతిభ కనబర్చాడు.
ఇంగ్లాండ్ లయన్స్‌కు ఓదార్పు విజయం
RELATED ARTICLES