పుణె : మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఏ విధమైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నాడో ధోని కూడా అదే మాదిరి ఫిట్‌నెస్‌ను కలిగి ఉన్నాడని టీమిండియా హె్‌డ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోని మంచి ప్రదర్శన చేస్తే టీ20 ప్రపంచకప్‌నకు పోటీలో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఫామ్ ధోని భవిష్యత్తుని నిర్ణయిస్తుందని రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా, ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ ‘మహీతో నేను ఏకాంతంగా మాట్లాడాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు‘ అని అన్నాడు. ‘అప్పుడు ధోనికి కేవలం టీ20లు మాత్రమే మిగులుతాయి. వచ్చే ఐపీఎల్‌లో ధోని ఆడతాడు. మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే తనకు తానుగా ధోనీ జట్టుకు భారం అవ్వడు. కానీ, అతడు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది‘ అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ధోనీ, రిషభ్ పంత్, సంజు శాంసన్‌ను ఎంపిక చేసే విషయంలో మిడిలార్డర్‌లో అనుభవం, ఫామ్ ఎంతో కీలకమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ‘ఆటగాడి ఫామ్, అనుభవాన్ని మేం పరిగణనలోకి తీసుకుంటాం. వారు 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఒకవేళ ఐపీఎల్‌లో ధోనీ బాగా ఆడితే అత డు కూడా రేసులో ఉంటాడు‘ అని శాస్త్రి చెప్పాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని రవిశాస్త్రి వెనుకేసుకొచ్చాడు. ‘పంత్‌కు కేవలం 21 ఏళ్లు. ఆ వయసులో సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు ఎవరున్నారు? ‘ అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. ‘ప్రతి ఒక్కరూ తప్పిదాలు చేస్తారు. పరిణతి సాధించే కొద్దీ అతడు మెరుగవుతాడు. రాత్రికి రాత్రే సాధ్యం కాదు. పంత్ మ్యాచ్ విజేత అనడంలో సందేహం లేదు. అతడికి ప్రతిభ ఉంది‘ అని శాస్త్రి అన్నాడు. అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పిన రవిశాస్త్రి… ఆ దిశగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడని తెలిపాడు.
ఆ ముగ్గురే కీలకం
RELATED ARTICLES