పుల్వామా ఉగ్రదాడిపై ఆధారాలివిగో..
దాడిలో పాక్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం : కెజెఎస్ ధిల్లన్
శ్రీనగర్: సిఆర్‌పిఎఫ్ జవానులు 40 మంది బలైన కారు బాంబు దాడిలో పాకిస్థాన్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని మంగళవారం భారత ఉన్నత సైనికాధికారి తెలిపారు. కశ్మీర్‌లో ఎవరైన తుపాకులు చేతబట్టాక లొంగిపోకపోతే వారిని ఏరిపారేస్తామని కూడా హెచ్చరించారు. పులామాలో ఫిబ్రవరి 14న ఉగ్రదాడి జరిగి 100 గంటలు ముగియక ముందే కశ్మీర్‌లో జైషే మొహ్మద్ నాయకత్వాన్ని మట్టుబెట్టామన్నారు. శ్రీనగర్‌లోని 15వ కోర్‌కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ కెజెఎస్ ధిల్లన్ విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఈ సమావేశంలో కశ్మీర్ ఐజి ఎస్‌పి పణి, సిఆర్‌పిఎఫ్ ఐజి జుల్ఫికర్ హసన్ పాల్గొన్నారు. దక్షిణకశ్మీర్‌కు చెందిన పుల్వామా జిల్లాలోని పింగ్లన్ ప్రాంతంలో సోమవారం 16 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు జైషే ఉగ్రవాదులను హతమార్చారు. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన ప్రదేశానికి 12 కిమీ. దూరంలో వారిని మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌లో ఓ ఆర్మీ మేజర్, నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ‘జైషే మొహ్మద్‌ను రూపొందించింది పాకిస్థాన్ సైన్యమే. దానిని నియంత్రిస్తోంది కూడా పాక్‌సైన్యం, ఐఎస్‌ఐ. పుల్వామా దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందన్నది నిస్సందేహంగా 100 శాతం నిజం’ అని ధిల్లన్ విలేకరులతో అన్నారు. తీవ్రవాదంలో చేరిన తమ పిల్లలను లొంగిపొమ్మని నచ్చజెప్పాల్సిందిగా కశ్మీరీ యువత తల్లిదండ్రులకు ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఒకవేళ లొంగిపోకపోతే వారిని ఎరివేస్తాం అన్నారు. ‘కశ్మీర్‌లో ఎవరైన తుపాకులు చేతబట్టాక లొంగిపోకపోతే వారిని హతమార్చడం జరుగుతుందన్నారు. ఇది కశ్మీర్‌లోని అందరికీ మేము ఇచ్చే సందేశం’ అని చెప్పారు. ‘సోమవారం హతమార్చిన జైషే ఉగ్రవాదుల్లో ఒకరైన ఘాజీ అబ్దుల్ రషీద్‌కు ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలున్నాయా?’ అని విలేకరులు ప్రశ్నించినప్పుడు, ‘ఎందరో ఘాజీలు వచ్చారు, పోయారు.